రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్న రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు
సాక్షి, సంగారెడ్డి: తహసీల్దార్ల బదిలీపై రెవెన్యూ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించిందని జిల్లా అధ్యక్షుడు బొమ్మరాములు తెలిపారు. 2018 అక్టోబర్ ఎన్నికలకు ముందు జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్లు అంతా పూర్వ జిల్లాలకు బదిలీ కానున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్‌కుమార్, ట్రెస్సా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ) ప్రతినిధులు ఆదివారం చర్చించారని చెప్పారు. తమ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లు స్పందించారని ఆయన చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షఫీయోద్దీన్, కార్యవర్గ సభ్యుడు గోపాల్, కిరణ్‌కుమార్, దశరథ్, కార్తీక్, వీరేశం, బాల్‌రాజ్, గుండేరావు, ఉమర్‌పాష, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment