యువకుడు దారుణ హత్య
యువకుడిని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం ఉదయం దామినేడు ఇందిరమ్మ గృహాల్లో వెలుగుచూసింది.
తిరుచానూరు :యువకుడిని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం ఉదయం దామినేడు ఇందిరమ్మ గృహాల్లో వెలుగుచూసింది. తిరుచానూరు సీఐ కేవి.సురేంద్రనాయుడు, మృతుని బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వడమాలపేట మండలం కాయం హరిజనవాడకు చెందిన కాయం సురేష్(28) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో 6నెలలుగా దామినేడు ఇందిరమ్మ గృహసముదాయంలోని 21వ బ్లాకులో 17వ నెంబరు ఇంటిలో అద్దెకుంటున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి గొంతుకోసి దారుణంగా హతమార్చారు. ప్రేమ వ్యవహారం హత్యకు దారి తీసుంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా సురేష్, అతని మేనమామ కుమార్తె ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో హత్య చేసి ఉంటారని మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.