సాక్షి, కడప : మిగతా పార్టీల కన్నా భిన్నంగా బీజేపీ నూతన కార్యవర్గ ఎంపిక జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాజధానిని టీడీపీ వివాదాస్పదం చేయడం తగదని, అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. తానే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పోలవరం, రాజధాని నిధులను దోచుకుందని, ఇసుక అక్రమ రవాణా నివారించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రజాధనాన్ని లెక్క లేకుండా తెలుగు తమ్ముళ్లకు బాబు దోచిపెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అన్నారు. కేంద్రం కేటాయించిన నిధులను లెక్క చూపి నిధులు రాబట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment