కుటుంబ సభ్యులతో సురేష్ (సర్కిల్‌లోని వ్యక్తి) (ఫైల్)
♦ కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
♦ సురేష్ ఆచూకీపై వీడని ఉత్కంఠ
సూర్యాపేట క్రైం :
సురేష్ ఉన్నాడా.. లేడా..? ఉంటే ఎక్కడున్నాడు..? అప్పుల బాధ తాళలేక అతనే ఎక్కడికైనా పరారయ్యాడా..? కుటుంబసభ్యుల సామూహిక ఆత్మహత్య విషయం అతనికి తెలిసిందా..? ఇంతకీ వ్యాపారం చేశాడా..? చేస్తేనిజంగానే నష్టం వచ్చిందా..? లేక జల్సాలకు అలవాటుపడి డబ్బులు ఖర్చు చేశాడా..? ఇప్పుడు సూర్యాపేట పట్టణంలో ఎక్కడా చూసినా ఇదే చర్చ జరుగుతోంది. సురేష్ ఆచూకీపై ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. దీంతో జిల్లా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
ఆరు నెలలుగా ఫోన్ కాల్ కూడా లేదు..
ఫారెక్స్ అమెరికన్ బేస్డ్ మల్టీనేషన్ కంపెనీగా తెలుస్తోంది. దీని ద్వారా సురేష్ షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తాడని సమాచారం. అయితే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతుండడం.. తరచూ సురేష్ çపుణె వెళ్తున్నట్లుగా తెలుస్తుండగా గత ఆరు నెలలుగా ççపుణె నుంచి, మహారాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా ఆయనకు వచ్చినట్లుగా ఆధారాలు లేవని విశ్వసనీయంగా తెలుస్తోంది.
రూ.కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారు..
సురేష్ వ్యాపారం పేరుతో సేకరించిన రూ.కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారనే కోణంలో విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు బ్యాంకు ఖాతాను పరిశీలించేందుకు నిమగ్నమయ్యారు. సురేష్ ఫోన్ ఆధారంగా విచారణ ముందుకు సాగకపోవడంతో పోలీసులు షేర్‌మార్కెట్ బ్యాంకు ఖాతాను పరిశీలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సురేష్ ఫోన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లగానే స్విచ్‌ఆఫ్ అయినట్లు సమాచారం. కానీ ఇంట్లో మాత్రం పూణెకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లడం జరిగింది.అసలు సురేష్ ççపుణెకు వెళ్లాడా.. లేక మధ్యలోనే ఆగిపోయాడ అన్న కోణాలపై పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం.
ఇండిగో విమానం ఎక్కేందుకు ప్రయత్నం
సురేష్ ఇండిగో విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా దొరకలేదని తెలిసింది. హైదరాబాద్‌లోని స్వప్నం ట్రావెల్స్ నుంచి çపుణెకుటిక్కెట్ బుకింగ్ చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 11వ తేదీన అర్ధరాత్రి 10:44 నిమిషాలకు భార్య ప్రభాతతో చివరి సారిగా ఫోన్ మాట్లాడి హైదరాబాద్‌లో ఉన్నానని.. ఇక్కడి నుంచి ççపుణెకు వెళ్తున్నట్లుగా చెప్పినట్లు భార్య సూసైడ్‌నోట్‌లో పేర్కొంది.
పుణే లేదా ముంబయిలోనా..
సురేష్ మాత్రం ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు భార్య ప్రభాతతో పూణేకువెళ్తున్నానని చెప్పాడు. అయితే సురేష్ çపుణేలోనే ఉన్నాడా.. లేక ముంబయిలో ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి అందరికీ దూరంగా ఉన్నాడా..? సజీవంగా ఉన్నాడా లేక జరగరాని ఘోరమేమైనా జరిగిందా..? అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ బతికే ఉంటే ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురు ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన జాతీయ మీడియాలో కూడా ప్రసారమైంది. తెలిసి ఉండికూడా రావడం లేదా..? లేక ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.