
సాక్షి, హైదరాబాద్ : ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న కరాటపు సురేష్ (38) గత ఏడేళ్లుగా ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఆర్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. దసరా పండుగ నేపథ్యంలో భార్య, కుమారుడు కాకినాడ వెళ్లడంతో ఇంట్లో అతడు ఒకడే ఉన్నాడు. మంగళవారం రాత్రి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని... సురేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.