
ముంబై: ముంబై, కర్ణాటకలో పలు బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో ప్రధాన నిందితుడు, 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ సురేశ్ పూజారిని ఫిలిప్పీన్స్ పోలీసులు అరెస్ట్‌చేసి భారత్‌కు అప్పగించారు. అక్టోబర్‌లో అతడిని ఫిలిప్పీన్స్‌లో అరెస్ట్‌చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అతడిని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సీబీఐ అధికారులు థానెలో నమోదైన కేసు విచారణ నిమిత్తం ముంబైకు తరలించారు.
చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ
బెదిరింపుల కేసులో అతడిని 25వ తేదీ దాకా మహారాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) కస్టడీకి అప్పగిస్తూ థానెలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాజేంద్ర బుధవారం ఉత్తర్వులిచ్చారు. మహారాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు థానెలో నమోదైన 23 కేసులను మహారాష్ట్ర ఏటీఎస్‌కు బదలాయించారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న పూజారిని అరెస్ట్‌చేయాలంటూ గతంలో ముంబై, థానె పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment