
నిందితుడు సురేష్
తిరుపతి : క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి చిన్న నగరాలకు కూడా పాకుతోంది. సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని యువతులను మోసగిస్తూ, వారిని అసభ్యంగా ఫోటోలు తీసి, అనంతరం బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముఠా ఆగడాలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయింది. ఇందుకు సంబంధించి సురేష్ అనే యువకుడితో పాటు అతని స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన సురేష్ స్థానికంగా ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు.
కొంతకాలంగా స్నేహితులతో కలిసి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ ఆడిషన్స్ పేరుతో అమ్మాయిల అసభ్య ఫొటోలను తీసి, బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన మాట వినని, వ్యతిరేకించిన వారి ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెడుతూ అసభ్య పదాలతో సురేష్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇందుకు సంబంధించి ఓ యువతి ధైర్యం చేసి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment