
ఉరి వేసుకున్న రాజు
పాయకరావుపేట: త్వరలో పెళ్లి పీటలు ఎక్కవలసిన ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎస్‌ఐ విభీషణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడివాడ మండలం పెద్ద పట్నాల లంక గ్రామానికి చెందిన వంటెద్దు రాజు (26) అనే యువకుడు పాయకరావుపేటలో అద్దె ఇంట్లో ఉంటూ ఆరు సంవత్సరాలుగా నక్కపల్లి మండలం రాజియ్యపేట వద్ద గల హెటిరో కంపెనీలో డాక్యుమెంటరీ డిపార్టుమెంట్‌లో పని చేస్తున్నాడు. పది రోజుల కిందట ఇతనికి కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదుగాని ఆదివారం రాత్రి తాను నివాసముంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, సమాచారం తెలుసుకున్న మృతుడి తండ్రి సత్యనారాయణ, కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. కుమారుడి మృతదేహం చూసి భోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment