జైపూర్: ఓ వ్యక్తి మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకున్నాడు. దుష్టశక్తులు పీడిస్తున్నాయంటూ ఓ మహిళ (మంత్రగత్తె) ఇనుపకడ్డీతో కాల్చడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. రాజస్థాన్లో ఈ దారుణం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
కిషన్ లాల్ (50) అనే వ్యక్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఆయన్ను చికిత్స కోసం లక్ష్మిదేవి అనే మహిళ దగ్గరకు తీసుకెళ్లారు. కిషన్ లాల్ను దుష్టశక్తులు పీడిస్తున్నాయని ఆమె చెప్పింది. విరుగుడు పేరుతో కాల్చిన ఇనుప కడ్డీతో వాతలు పెట్టింది. తీవ్రంగా గాయపడిన కిషన్ లాల్ పరిస్థితి విషమించింది. ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో ఆమెను ఇంకా అరెస్ట్ చేయలేదు.
దుష్టశక్తులు పీడిస్తున్నాయంటూ.. చంపేసింది
Published Sat, Apr 9 2016 2:39 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement
Advertisement