చండ్రుగొండ/జూలూరుపాడు, న్యూస్‌లైన్: బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ము ఠాలో ఇద్దరు యువకులను సోమవారం చండ్రుగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జి ల్లాలో ఇటీవల కాలంలో ఈ తరహా చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు యువకుల ను పోలీసులకు చిక్కారు. విశ్వసనీయ సమాచా రం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూలూరుపా డు మండలం గాంధీనగర్‌కు చెందిన దారావత్ లక్ష్మి ఇంటికి సోమవారం ఇద్దరు యువకులు వచ్చారు.
బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామని వారు చెప్పడంతో ఆమె తన కాళ్లకు ఉన్న వెండి పట్టీలు ఇచ్చింది. మెరుగు పెట్టిన తర్వాత పట్టీలు తళతళా మెరుస్తుండడంతో ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును ఇ చ్చింది. అనంతరం లక్ష్మి కుమార్తెను అక్కడ ఉంచి బట్టలు ఉతికేందుకు వెళ్లింది. దీంతో ఆ యువకులు ఇంట్లోకి వెళ్లి ఒక పాత్ర తీసుకురావాలని లక్ష్మి కుమార్తెకు తెలిపారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన క్రమంలో ఆ యువకులు గొలుసును మాయం చే శారు. అనంతరం ఒక చిన్న బాక్స్‌ను లక్ష్మి కుమా ర్తె చేతికి ఇచ్చిన వారు కొద్ది సేపటి తర్వాత మూత తీయాలని సూచించి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆ బాక్స్‌ను తెరిచి చూడగా అందులో గొలుసు లేదు.
దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన లక్ష్మి లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇస్లావత్ వీరన్న స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై దేవేందర్‌రావు సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా మరింత సమాచారం లభించినట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు జిల్లాలో సంచరిస్తూ మెరుగు పేరిట బంగారం ఆభరణాలు దొంగలిస్తున్న ముఠా సభ్యుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి రాని తెలుగులో మాట్లాడుతున్నట్లు తెలిసింది. హిందీ భాషలో మాట్లాడుతున్న వారు ఇతర రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో ‘మెరుగు’ దొంగలు
Published Tue, Aug 27 2013 4:04 AM | Last Updated on Thu, Aug 2 2018 4:53 PM
Advertisement
Advertisement