జైపూర్: నిఘా కెమెరాల కారణంగా ఇటీవల వింతైన దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరూ చూడట్లేదు కదా అని పాలప్యాకెట్లు, బల్బులు ఎత్తుకెళ్తున్న సంఘటనల వీడియోలు వైరల్‌గా మారాయి. అలాంటి సంఘటనే రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో జరిగింది. అయితే, ఇక్కడ దొంగలు ఏకంగా కారులో వచ్చి బల్బులు చోరీ చేశారు. తెల్ల రంగు ఆల్టో కారులో వచ్చిన దొంగల్లో ఇద్దరు క్షణాల్లో బల్బులను మాయం చేశారు. కారులో మరికొంత మంది ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
తొలుత ఓ దుకాణం ముందు ఏర్పాటు చేసిన బల్బును దొంగలించేందుకు ప్రయత్నం చేశారు ఇద్దరు దొంగలు. సాధ్యం కాకపోవటంతో మరో దుకాణం వద్ద ఉన్న కుర్చీని తీసుకొచ్చి తమ పని తనాన్ని చూపించారు. ఈ సంఘటన జిల్లాలోని కోల్సియా గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
దొంగతనానికి పాల్పడుతున్న క్రమంలో ఏదో శబ్దం వినబడి దుకాణం యజమాని మహేంద్ర దూత్ నిత్రలేచాడు. బయటకి వచ్చి చూసేసరికి దొంగలు కారులో పరారయ్యారు. ఎదురుగా ఉన్న దుకాణం షటర్‌ను పగలగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు విని బయటకు వచ్చానని, తనను చూసి పరారయ్యారని తెలిపారు దూత్. మరోవైపు.. దుకాణంలో చోరీ చేసేందుకు ముందుగా బల్బులను తొలగించాలనుకున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై అధికార పార్టీ విస్తృతస్థాయి నిరసన
Comments
Please login to add a commentAdd a comment