సాక్షి, అనంతపురం అర్బన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి వెచ్చించే ఖర్చును ఎన్నికల కమిషన్‌కు తప్పకుండా చూపాలి.. ఈవిషయంలో భారత ఎన్నికల కమిషన్ కచ్చితత్వాన్ని పాటిస్తుంది.. ఎన్నికల ప్రచార ఖర్చు చూపని అభ్యర్థులు మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తుంది. ఇలా ఎన్నికల ఖర్చు చూపని ఆరుగురు అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది.వివరాలు ఇలా.. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యయం వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదు. వ్యయం వివరాలను సమర్పించేందుకు వీరికి చాలా సార్లు నోటీసులిచ్చినా స్పందించలేదు. దీంతో ఆరుగురు అభ్యర్థులు 2017 జూన్ 27 నుంచి 2020 జూన్ 27 వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తూ నిషేధం విధించింది.
అభ్యర్థులూ జాగ్రత్త : ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం వ్యయం వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కమిషన్ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించినా వేటు తప్పదు. కమిషన్ నియమ, నిబంధనలను అనుసరించి ఎన్నికల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. లేదంటూ మూల్యం చెల్లించుకోక తప్పదు.
పోటీచేసిన నియోజకవర్గం | అభ్యర్థి |
శింగనమల | పి.ఎన్.వరప్రసాద్ |
శింగనమల | బండారు రామాంజనేయులు |
అనంతపురం అర్బన్ | ఆర్.చెన్నరాజేశ్‌గౌడ్ |
అనంతపురం అర్బన్ | ఎస్.అబ్దుల్ అజీజ్ |
అనంతపురం అర్బన్ | ఎస్.అబ్దుల్ ఖాదర్ |
మడకశిర | టి.ధనరాజ్ |
Comments
Please login to add a commentAdd a comment