![Rahul Gandhi Disqualification: BRS Party Chief KCR Slams BJP Modi - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/24/CM-KCR124.jpg.webp?itok=_mXjJ5Ru)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీ అనర్హత వేటు పరిణామంపై బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ చీకటి దినమని పేర్కొన్నారాయన.
రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన కేసీఆర్.. ఇది చీకటి రోజని, రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు అనర్హత వేటు వేయడం నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. మోదీ పాలన ఎమర్జెనీని మించిపోతోంది. ప్రతిపక్ష నేతలకు వేధించడం బీజేపీకి పరిపాటిగా మారింది. బీజేపీ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ పరిణామంపై స్పందించారు. రాహుల్ గాంధీపై వేటు అప్రజాస్వామికమని పేర్కొన్నారాయన. ఇలా చేయడం రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడమే. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు కేటీఆర్.
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని అన్యాయంగా రద్దు చేశారు. తమ వైఫల్యాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ కుట్రకు దిగింది. ప్రతిపక్షాల అణచివేతలో మోదీ మిషన్ పెద్ద భాగం అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment