గుంటూరు, సాక్షి: ఎన్నికల ముందర అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సాక్షితో స్పందించారు. నిష్పక్షపాతంగా తాను వ్యవహరించానని.. చట్ట ప్రకారమే నడుచుకున్నానని అన్నారాయన.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ ముగించాం. విచారణ అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వాదనలు వినిపించేందుకు వాళ్లకు తగిన సమయం ఇచ్చాం. కానీ, వాళ్లు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. కాబట్టే విచారణ ముగించి అనర్హత వేటు వేశాం.
ఈ విషయంలో నేను నిష్ఫక్షపాతంగా వ్యవహరించా. చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నా అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్‌సీపీలో చేరినవాళ్లపైనా చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘అనర్హత వేటు పడ్డవాళ్లు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు. మాదీ(అసెంబ్లీని ఉద్దేశించి..) కోర్టు లాంటిదే. ఇక వారిష్టం’’ అని స్పీకర్ తమ్మినేని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment