Disinfectant
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే చర్యలు: స్పీకర్ తమ్మినేని
గుంటూరు, సాక్షి: ఎన్నికల ముందర అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సాక్షితో స్పందించారు. నిష్పక్షపాతంగా తాను వ్యవహరించానని.. చట్ట ప్రకారమే నడుచుకున్నానని అన్నారాయన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ ముగించాం. విచారణ అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వాదనలు వినిపించేందుకు వాళ్లకు తగిన సమయం ఇచ్చాం. కానీ, వాళ్లు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. కాబట్టే విచారణ ముగించి అనర్హత వేటు వేశాం. ఈ విషయంలో నేను నిష్ఫక్షపాతంగా వ్యవహరించా. చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నా అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీలో చేరినవాళ్లపైనా చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘అనర్హత వేటు పడ్డవాళ్లు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు. మాదీ(అసెంబ్లీని ఉద్దేశించి..) కోర్టు లాంటిదే. ఇక వారిష్టం’’ అని స్పీకర్ తమ్మినేని అన్నారు. -
‘ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగం’
బెంగుళూరు: ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగమని, అలాంటి ఆవులను చంపడం నేరమని కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ తెలిపారు. చిక్కబల్లాపూర్లో గోశాల ప్రారంభత్సంలో సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోసంరక్షణ, గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. వ్యాధి కారకాలను ఆవు నిరోదిస్తుందని ఇది వరకే రుజువు అయిన విషయాన్ని సుధాకర్ గుర్తు చేశారు. గోవద నిషేద చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి యడియూరప్ప సిద్దంగా ఉన్నారని తెలిపారు. కాగా కరోనా వ్యాప్తి తగ్గగానే ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, గోవద నిషేద చట్టానన్న అమలు చేస్తున్న గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలకు వెళ్లి గోవద నిషేద చట్టాన్ని అధ్యయనం చేస్తామని పశుశాఖ అధికారులు తెలిపారు. అయితే బీజేపీ గోవద నిషేద చట్టాన్ని 2018అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తమ మేనిఫెస్టేలో చేర్చిన విషయం తెలిసిందే. చదవండి: నిఖిల్ పెళ్లిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
గుడ్ న్యూస్ చెప్పిన జపాన్ శాస్త్రవేత్తలు
టోక్యో: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైరస్ బారి నుంచి జనాలను కాపాడటానికి పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జపాన్ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ గ్యాస్ కరోనా వైరస్ కణాలను తటస్తం చేయగలదని తెలిపారు. అందువల్ల ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలు వంటి ప్రదేశాల్లో దీన్ని డిస్ఇన్ఫెక్టెంట్గా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఓజోన్ వాయువు 0.05 నుంచి 0.1 పీపీఎం, మానవులకు హానిచేయనిదిగా భావించే స్థాయి వైరస్‌ని చంపగలదని గుర్తించాము అన్నారు ఈ ప్రయోగంలో వారు కరోనా వైరస్ నమూనా ఉన్న కలిగిన మూసివున్న గదిలో ఓజోన్ జనరేటర్‌ను ఉపయోగించారు. దాదాపు 10 గంటల పాటు తక్కువ సాంద్రత గల ఓజోన్ గ్యాస్‌ను ఉపయోగించడం వలన.. వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్లు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సైంటిస్ట్ తకాయుకి మురాటా మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం కోసం.. ప్రజలు ఉన్న వాతావరణంలో కూడా నిరంతర, తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును పంపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అధిక తేమతో కూడిన పరిస్థితుల్లో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని మేము గుర్తించాము’ అన్నారు. ఓజోన్, ఒక రకమైన ఆక్సిజన్ అణువు. ఇది అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుంది. 1-6 పీపీఎం మధ్య అధిక సాంద్రత కల ఓజోన్ వాయువు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఈ అధిక సాంధ్రత మానవులకు విషపూరితమైనది అని గతంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి. (చదవండి: వారియర్స్‌పై వైరస్ పంజా!) జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మనం నిత్యం వాడే గౌన్లు, గాగుల్స్, ఇతర వైద్య రక్షణ పరికరాలను డిస్ఇన్ఫెక్టెంట్ చేయడంలో ఓజోన్ ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. సెంట్రల్ జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చర్‌లోని ఫుజిటా మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్, వెయిటింగ్ రూంలు, రోగుల గదుల్లో వైరస్ సంక్రమణను తగ్గించడానికి ఓజోన్ జనరేటర్లను ఏర్పాటు చేసింది. (చదవండి: మాస్కులతో పెరుగుతున్న నిర్లక్ష్యం) -
'క్షమించండి.. అది కావాలని చేయలేదు'
ఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో సొంతూళ్లకు వెళ్లాలని భావించిన వలసకూలీలకు ఢిల్లీలో శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. సొంతూళ్లకు వెళ్లేందుకని శ్రామిక్ రైలు ఎక్కేందుకు వచ్చిన వలస కూలీలు ముందుగా హెల్త్ స్ర్కీనింగ్ కోసం ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో ఉన్న పాఠశాలకు చేరుకొని పరీక్షల కోసం క్యూలో నిల్చున్నారు. ఇంతలో అక్కడికి క్రిమి సంహారక మందు చల్లేందుకని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు క్రిమి సంహారక మందు చల్లే సమయంలో పొరపాటున జెట్టింగ్ మిషన్‌లోని రీకాయిల్ డైరెక్షన్ మారడంతో ఆ మందు మొత్తం వలస కూలీలపై విరజిమ్మింది. దీంతో అక్కడ నిల్చున్న వలస కూలీలు స్ర్పే ఒత్తిడి దాటికి తట్టుకోలేక కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఈ ఘటనపై ఎస్ఎండీసీ స్పందిస్తూ.. ' క్షమించండి.. అది కావాలని చేసింది కాదు. క్రిమి సంహారక మందు చల్లుతున్న సమయంలో పొరపాటుగా జెట్టింగ్ మిషన్ డైరెక్షన్ మారడంతో వలస కూలీలపైకి స్ర్పే వెళ్లింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందే ఉహించిన తాము సిబ్బందికి స్ర్పే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించాం. అయినా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. అయితే స్ర్పే సమయంలో జెట్టింగ్ మిషన్‌లో రీకాయిల్పై ఒత్తిడి పెరగడంతోనే ఇలా జరిగిందంటూ' తెలిపింది. కాగా వలస కూలీలకు స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాల జనావాసాలకు దగ్గరగా ఉండడంతో అక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రతిరోజు పాఠశాల పరిసరాలతో పాటు రోడ్లు మీద క్రిమి సంహారక మందు చల్లుతున్నట్లు ఎస్ఎండీసీ పేర్కొంది. (24 గంటల్లో.. 6654 కరోనా కేసులు) (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక) -
వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్‌వో
కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా వీధుల్లో స్ప్రే చేసే క్రిమి సంహారక మందుల వల్ల ఫలితం శూన్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొన్ని దేశాల్లో వీటిని యథేచ్చగా వీధుల్లో చల్లుతున్నారని, దీనివల్ల కరోనా నాశనమవదని పైపెచ్చు మనుషుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. శనివారం డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో.. "వీధులు, మార్కెట్ స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులు చల్లడం ద్వారా అది ధూళి కణాల్లో క్రియారహితంగా మారిపోతుంది. తద్వారా అది కరోనానే కాదు, ఇతర వ్యాధి కారక క్రిములపై కూడా ఏమాత్రం ప్రభావితం చూపలేవు. (కోవిడ్ వ్యాక్సిన్ ధర తక్కువే) వీధుల్లో కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశముందన్న భావనతో క్రిమి సంహారకాలను అధికంగా స్ప్రే చేస్తున్నారని, దీని వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంద"ని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. అంతేకాక కొన్నిచోట్ల మనుషులపై క్లోరిన్ వంటి రసాయనాలను నేరుగా ప్రయోగిస్తున్నారని దీనివల్ల వైరస్ వ్యాప్తిని నిలువరించగలం అన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. పైగా దీనివల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. (ఆ వైరస్ చావలే.. 40 ఏళ్లుగా బతికే ఉంది?) -
స్ప్రేల వల్ల కరోనా వైరస్ చస్తుందా!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా భారత్ సహా పలు దేశాల్లో వీధులను, బహిరంగ ప్రదేశాలను ‘బ్లీచ్’తో స్ప్రే చేస్తున్నారు. స్పెయిన్ దేశమైతే మరో అడుగు ముందుకేసి బీచ్‌లను కూడా ‘బ్లీచ్’తో శుభ్రం చేసింది. ఈ కార్యక్రమాలను విదేశాల్లో పారిశుద్ధ్య కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు నిర్వహిస్తుండగా భారత దేశంలో అక్కడక్కడ పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తలతోపాటు ‘మేము సైతం’ అంటూ రాజకీయ నాయకులు కూడా నడుంగట్టారు. (ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోమ్!) ఇలాంటి స్ప్రేల వల్ల ప్రయోజనం ఏమిటీ ? కరోనా వైరస్ లాంటి మహమ్మారీని చంపేంత శక్తి ‘బ్లీచ్’కు ఉందా? ఉంటే దీని నుంచే కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టవచ్చుగదా! పోనీ దీనికి ఇతర వైరస్లు లేదా బ్యాక్టీరియాను చంపేంత శక్తి ఉందా ? బ్లీచ్‌ను స్ప్రే చేయడం వెనకనున్న అసలు ఉద్దేశం ఏమిటీ? బ్లీచ్‌లో ప్రధానంగా ఐదు శాతం ‘సోడియం హైపో క్లోరైట్’ ఉంటుంది. దీనికి బ్యాక్టీరియాను హరింపచేసే గుణం ఉంది. అందుకే తాగే నీటిలో దీన్ని ఎక్కువగా కలుపుతుంటారు. వైరస్‌లను చంపుతుందనడానికి గ్యారంటీ లేదు. చంపే అవకాశముందున్న అంచనా మాత్రమే ఉంది. (గబ్బిలాలపై కరుణ ఎందుకు?) చల్లటి వాతావరణంలో మూడు, నాలుగు నిమిషాలు మాత్రమే ప్రభావం చూపించే క్లోరిన్‌కు సూర్య రశ్మిలో, వేడి వాతావరణంలో ఒక్క నిమిషానికి మించి ప్రభావం చూపించదు. అంటే ఒక్క నిమిషం మాత్రమే దానికి వైరస్‌ను చంపే శక్తి ఉంటుందన్నమాట. అంటే నేరుగా బ్లీచ్ వెళ్లి వైరస్ల మీద పడినప్పుడే అవి చనిపోయే అవకాశానికి ఆస్కారం ఉన్నట్లు. మరి దీని వల్ల ప్రయోజనం ఏమిటీ ? (వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చింది: పాంపియో) ఈ విషయాన్ని ఆలోచించడానికి ముందు కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుందో మరోసారి గుర్తు చేసుకోవాలి. కరోనా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు శ్లేష్మం రెండు రకాలుగా బయటకు వస్తోంది. ఒకటి తేలికపాటి తుంపర్లు. అవి నేల మీద పడే లోగానే కొన్ని క్షణాల్లోనే గాల్లోనే ఆవిరవుతాయి. రెండు, నీటి బొట్టుల్లా పెద్దవి. అవి నేలమీద పడితే గరిష్టంగా మూడు గంటలపాటు ఉంటాయి. ఈ రెండు రకాల తుంపర్ల నుంచి కరోనా వైరస్ బయటకు వచ్చి పడుతుంది. అది పడిన ఉపరితలంను బట్టి దాని జీవితకాలం ఆధారపడి ఉంది. ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్‌పైనా 72 గంటలు ప్లాస్టిక్ మెటీరియల్, స్టెయిన్లెస్ స్టీల్ ఉపరితలాలపై కరోనా వైరస్ 72 గంటలపాటు బతికి ఉంటుంది. రాగిపై ఎనిమిది గంటలు, కార్డు బోర్డులపై నాలుగు గంటలపాటు మాత్రమే జీవించగలదు. ఈలోగా ఎవరైనా వైరస్ ఉన్న ప్రాంతంపై చేతులు పెడితే వారి చేతులకు అంటుకుంటుంది. వారు ఆ చేతులను ముక్కు, నోరు, కళ్లలో పెట్టుకున్నప్పుడే వైరస్ వారికి సోకుతుంది. అన్నింటికన్నా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపించేది పక్క పక్కన ఉన్నప్పుడే. రోగి తుమ్మినా, దగ్గినా, ఆ తుంపర్లు పక్కవారి మొహంపై పడి, తుడుచుకోవడం ద్వారా లేదా మరో రకంగానో నోరు, ముక్కు, కళ్ల ద్వారా లోపలికి పోతే సోకుతుంది. (అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేత ఫలితం?) కరోనా ఉపరితలాలు ఏమిటీ ? రోగులు బస్సులు, రైళ్లలో పట్టుకునే తలుపులు, రాడ్లు, కూర్చునే సీట్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కూర్చునే సీట్లు, ఆసరాగా పట్టుకునే ఉపరి తలాలు, లిఫ్టుల్లో పట్టుకునే తలుపుల హ్యాండిల్స్, లిఫ్ట్ గోడలు, ఇంటి ముందు గోడులు కూడా (తుమ్మడం, దగ్గడం వల్ల). ఇంట్లో తలుపుల గొళ్లాలు, తాళాలు, ఆసరాగా చేతులు ఆన్చే ప్రాంతల్లోనే కరోనా వైరస్ ఉండే ఆస్కారం ఉంది. ఇక రోగులు పట్టుకున్న ప్రతి వస్తువు, సరకు మీద ఉండే అవకాశం ఉంది. రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా ఉంచినప్పుడు మినహా కరోనా వైరస్ వీధుల్లో ఉండే అవకాశం లేదు. చెత్త కుప్పల వద్ద రోగుల ఇంటి నుంచి వచ్చే చెత్త వల్ల కొంత అవకాశం ఎక్కువ ఉంది. అయినా వీధుల్లో, చెత్త కుప్పలపై మూడు, నాలుగు గంటలకు మించి కరోనా బతికే అవకాశమే లేదు. పైగా కొన్ని నిమిషాలే ప్రభావం చూపించే బ్లీచ్లోని క్లోరిన్ వల్ల ప్రయోజనం ఏమిటీ? (కరోనా అనంతరం ప్రపంచం ఇలా మారనుంది...) కరోనాను కట్టడి చేయడం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు చెప్పడానికి, చూపించడానికి. తద్వారా ప్రజల్లో భరోసా కల్పిస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మాత్రమే. రోడ్ల మీద స్ప్రేల ద్వారా బ్లీచ్‌లను వధా చేయడానికి బదులు, రోడ్లపై ప్రజల కోసం అక్కడక్కడా బాడీ స్ప్రేలను ఏర్పాటు చేయడం ఇంకా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక : న్యూ ఇంగ్లండ్ జర్నల్ అండ్ మెడిసిన్, న్యూసైంటిస్ట్, సైన్స్ డైరెక్టర్, సిడ్రాప్–సెంటర్ ఫర్ ఇన్ఫెక్సియస్ డిసీస్ రిసర్చ్ అండ్ పాలసీ, సీడీసీ–సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, సీఈఆర్సీ–క్రైసిస్, ఎమర్జెన్సీ రిస్క్ కమ్యూనికేషన్ వెల్లడించిన శాస్త్ర విజ్ఞాన అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం) -
ట్రంప్ వ్యాఖ్యలు బాధాకరం: వైట్ హౌస్
వాషింగ్టన్: కరోనా కట్టడికి క్రిమిసంహారకాలు తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వైట్ హౌస్ టాస్క్‌ఫోర్స్ ఖండిచింది. ప్రజల ఆరోగ్యం కన్నా ఎకానమీ మీదే దృష్టి పెడుతూ వచ్చిన ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. కేవలం వ్యంగ్యపూరితంగా అలా మాట్లాడానని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కాగా కరోనా రోగులకు క్రిమిసంహారక మందులను ఎక్కించడంతోపాటు అతినీలలోహిత కిరణాలను శరీరంలోకి పంపించాలంటూ ట్రంప్ ఉచిత సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. పైగా దీనిపై వైద్యులు అధ్యయనం చేయాలని సూచించారు. కరోనాపై పోరాటానికి ఏర్పాటైన వైట్ హౌస్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. (ప్రమాదకర సలహాలు.. మాట మార్చిన ట్రంప్!) వైట్ హౌస్ టాస్క్‌ఫోర్స్ వైద్యురాలు డా.డెబోరా బ్రిక్స్ స్పందిస్తూ.. ఈ వార్తలు తనకు బాధ కలిగించాయన్నారు. అయితే గత నాలుగు రోజులుగా దీనికి సంబంధించిన వార్తలే ప్రసారం చేస్తూ, అమెరికా ప్రజలను రక్షించుకునేందుకు అవసరమయ్యే విషయాలను పక్కకు పెడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి లక్షణాలు లేని కరోనా రోగుల సంఖ్య పెరుగుతోందని, ప్రస్తుతం వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. ఇంకా అధ్యక్షుడి వ్యాఖ్యలను పట్టుకుని వేలాడటం సరికాదన్నారు. తొలిసారిగా ఇలాంటి వైరస్‌ను ఎదుర్కొంటున్నామని, ఏ వయసు వారిపై ఎలా ప్రభావం చూపుతుందో వాటిపై అధ్యయనం చేయాలన్నారు. ముఖ్యంగా వైరస్ ఇతరులకు వ్యాపించేలోగా దాన్ని నిర్ధారించాలని ఆమె సూచించారు. (వైట్‌హౌస్‌లో కరోనా కలకలం) -
రసాయనాలు తాగించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. కోవిడ్–19 అమెరికాను అతలాకుతలం చేస్తూ ఉంటే చేష్టలుడిగి చూస్తున్న ట్రంప్ అత్యంత ప్రమాదకర సలహాలు ఇవ్వడానికీ వెనుకాడటం లేదు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా అధ్యయనంలో సూర్యరశ్మి, గాలితో తేమ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తేలింది. దీంతో ట్రంప్ కోవిడ్ రోగులకు వైరస్‌ను నాశనం చేసే రసాయనాలు ఇంజెక్ట్ చేయాలని, అతినీలలోహిత కిరణాలను రోగుల శరీరంలోకి పంపించి వైరస్‌ను చంపాలని సలహా ఇచ్చారు. వైట్ హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశంలో హోంల్యాండ్ సెక్యూరిటీ చేసిన అధ్యయనం ఫలితాలను ఆ శాఖ సహాయ మంత్రి బిల్ బ్రయాన్ వెల్లడించిన వెంటనే ట్రంప్ కోవిడ్ రోగుల్లోకి వైరస్‌ను చంపేసే రసాయనాలు ఇంజెక్ట్ చేయాలని సలహా ఇచ్చారు. ‘రసాయనాలు, ఎండ తీవ్రతకి వైరస్ కేవలం నిముషంలోనే చచ్చిపోవడం చూస్తున్నాం. కోవిడ్ రోగుల ఊపిరి తిత్తుల్లోకి అల్ట్రావయోలెట్ కిరణాల్ని పంపించి చంపలేమా ? అది ఎలా చేయాలో ఆలోచించండి’అంటూ వ్యాఖ్యాని ంచడం అందరినీ విస్మయంలోకి నెట్టేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయనపై విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తాయి. రోగుల ప్రాణాలతో ఆడుకునే అలాంటి ప్రమాదకరమైన సలహాలు పాటించవద్దంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. చైనా మూల్యం చెల్లించుకుంటుంది కరోనా మహమ్మారిపై సమాచారాన్ని ఇతర దేశాలతో పంచకుండా ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన చైనా తగిన మూల్యం చెల్లించు కుంటుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ► బ్రిటన్ యువరాజు చార్లెస్ భారత్ సహా దక్షిణాసియా దేశాలను ఆదుకోవడానికి కోవిడ్ అత్యవసర నిధిని ప్రారంభించారు. ► టర్కీలో ఇస్తాంబుల్ మరో వూహాన్‌గా మారిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఫరేటిన్ కోకా ఆందోళన వ్యక్తం చేశారు. టర్కీలో లక్షా 4 వేలకి పైగా కేసులు నమోదైతే, 2,600 మంది వరకు మృతి చెందారు. అందులో అత్యధికభాగం ఇస్తాంబుల్‌లోనే నమోదయ్యాయి. ► రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులపై బంగ్లాదేశ్ నిషేధం విధించింది. దేశంలో కరోనా కేసులు 5 వేలకు చేరడంతో అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలో 50 వేల మంది మృతి అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం 50వేల మరణాలు దాటాయి. గత 24 గంటల్లోనే 3,176 మంది మరణించినట్లు తెలిపింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మరణాలు నమోదైన దేశం అమెరికానే కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడొంతుల్లో ఒక వంతు అగ్రరాజ్యంలోనే ఉన్నాయి. -
రాజమండ్రిలో డిస్ఇన్ఫెక్షన్ చాంబర్
-
హెల్త్ టిప్స్
పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పని సరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో కడగాలి. వాటిని పండించేటప్పుడు చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు, పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు అవి చేసే ప్రయాణంలో వాటినాశించిన క్రిమికీటకాలు, దుమ్ముధూళి... చన్నీటితో కడిగితే పూర్తిగా పోవు. శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేస్తే పచ్చి కూరగాయలతో వచ్చే ఆరోగ్యం కంటే ముందు పురుగు మందుల ప్రభావంతో సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి. -
పురుగు మందుల ధర పెరగదు
♦ బాయర్ సౌత్ హెడ్ మోహన్ రావు ♦ శివాంటో ప్రైమ్ క్రిమిసంహారిణి విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీ దిగ్గజం బాయర్ క్రాప్ సైన్స్ ఏటా మూడు నుంచి అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. ఎనిమిదేళ్లుగా ఈ స్థాయిలో నూతన ప్రొడక్టులను అందుబాటులోకి తెస్తున్నట్టు కంపెనీ సౌత్ బిజినెస్ యూనిట్ హెడ్ ఎన్.మోహన్ రావు గురువారం తెలిపారు. క్రిమి సంహారిణి శివాంటో ప్రైమ్‌ను ఇక్కడి విపణిలో ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వాణిజ్య పంటలు, కూరగాయలపై వచ్చే రసం పీల్చే పురుగును నివారించేందుకు శివాంటో ప్రైమ్ ఉత్తమంగా పని చేస్తుందని చెప్పారు. మొక్కలపై 15 రోజుల వరకు రసాయన ప్రభావం ఉంటుందని, దీంతో రైతుకు ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. ధరలు ఇప్పట్లో పెరగవు.. పురుగు మందులపై గతంలో 12.5 శాతం ఎక్సైజ్ సుంకం, 5 శాతం వ్యాట్ ఉండేది. ఇప్పుడు జీఎస్టీలో 18 శాతం పన్ను శ్లాబులోకి చేర్చారు. పన్ను స్వల్పంగా అధికమైనా, అమ్మకం ధర పెంచడం లేదని మోహన్ రావు వెల్లడించారు. శివాంటో ప్రైమ్ వాడితే రైతుకు ఒక ఎకరానికి రూ.1,000 ఖర్చు అవుతుందని ఈ సందర్భంగా వివరించారు.