వాషింగ్టన్: కరోనా కట్టడికి క్రిమిసంహారకాలు తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వైట్ హౌస్ టాస్క్‌ఫోర్స్ ఖండిచింది. ప్రజల ఆరోగ్యం కన్నా ఎకానమీ మీదే దృష్టి పెడుతూ వచ్చిన ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. కేవలం వ్యంగ్యపూరితంగా అలా మాట్లాడానని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కాగా కరోనా రోగులకు క్రిమిసంహారక మందులను ఎక్కించడంతోపాటు అతినీలలోహిత కిరణాలను శరీరంలోకి పంపించాలంటూ ట్రంప్ ఉచిత సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. పైగా దీనిపై వైద్యులు అధ్యయనం చేయాలని సూచించారు. కరోనాపై పోరాటానికి ఏర్పాటైన వైట్ హౌస్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. (ప్రమాదకర సలహాలు.. మాట మార్చిన ట్రంప్!)
వైట్ హౌస్ టాస్క్‌ఫోర్స్ వైద్యురాలు డా.డెబోరా బ్రిక్స్ స్పందిస్తూ.. ఈ వార్తలు తనకు బాధ కలిగించాయన్నారు. అయితే గత నాలుగు రోజులుగా దీనికి సంబంధించిన వార్తలే ప్రసారం చేస్తూ, అమెరికా ప్రజలను రక్షించుకునేందుకు అవసరమయ్యే విషయాలను పక్కకు పెడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి లక్షణాలు లేని కరోనా రోగుల సంఖ్య పెరుగుతోందని, ప్రస్తుతం వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. ఇంకా అధ్యక్షుడి వ్యాఖ్యలను పట్టుకుని వేలాడటం సరికాదన్నారు. తొలిసారిగా ఇలాంటి వైరస్‌ను ఎదుర్కొంటున్నామని, ఏ వయసు వారిపై ఎలా ప్రభావం చూపుతుందో వాటిపై అధ్యయనం చేయాలన్నారు. ముఖ్యంగా వైరస్ ఇతరులకు వ్యాపించేలోగా దాన్ని నిర్ధారించాలని ఆమె సూచించారు. (వైట్‌హౌస్‌లో కరోనా కలకలం)
Comments
Please login to add a commentAdd a comment