300 ఓట్లతో విజయం సాధిస్తాం: బైడెన్‌ | Joe Biden Says Democrats Are Winning with 300 Electoral Votes | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 7 2020 11:41 AM | Last Updated on Sat, Nov 7 2020 1:53 PM

Joe Biden Says Democrats Are Winning with 300 Electoral Votes - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌‌ ఇంకా కొనసాగతోంది. అధ్యక్షుడి ఎన్నికలో కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం కౌంటిగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ జో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో బైడెన్‌ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. డెమొక్రాట్లు 300 ఓట్లతో విజయం సాధించబోతున్నారని తెలిపారు. ఇప్పటికే స్పష్టం అయ్యింది. మనం గెలవబోతున్నామని తెలుస్తోంది అన్నారు బైడెన్‌. ప్రస్తుతం ఆయన 264 ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 214 వద్ద ఆగిపోయారు. ఈ క్రమంలో బైడెన్‌ మాట్లాడుతూ.. ‘ఇంకా తుది ఫలితాలు వెల్లడించలేదు. కానీ ఇప్పటి వరకు గెలిచిన ఓట్ల సంఖ్యను బట్టి మనం గెలవబోతున్నామని స్పష్టం అవుతుంది. గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందో చూడండి. ఐదు కీలక రాష్ట్రాల్లో మనం నాలుగింటిలో ముందంజలో ఉన్నాం’ అన్నారు. అంతేకాక ‘24 ఏళ్లలో అరిజోనాలో గెలిచిన మొదటి డెమొక్రాట్లం మనమే.. 28 ఏళ్లలో జార్జియాలో గెలిచిన మొదటి డెమొక్రాట్లం కూడా మనమే. మనం బ్లూ వాల్‌ని దేశం నడిబొడ్డున రీ బిల్ట్‌ చేశాం’ అంటూ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక ప్రస్తుతం కౌంటింగ్‌ కొనసాగుతున్న ఐదు కీలక రాష్ట్రాల్లో నాలుగింటిలో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. అరిజోనా, జార్జియా, నెవాడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో బైడెన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక అమెరికా ఎన్నికల్లో విజేతగా ప్రకటించాలంటే 530 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లలో 270 సాధించాలి. ఇక పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే  కోవిడ్‌ని కంట్రోల్‌ చేసే ప్రణాళికని అమలు చేస్తానని బైడెన్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే కరోనాని కంట్రోల్‌ చేస్తానని తెలిపారు. ఇప్పటికే 2,31,000 మంది అమెరికన్లు మరణించగా.. 9 మిలియన్ల కోవిడ్‌ బారిన పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement