కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా వీధుల్లో స్ప్రే చేసే క్రిమి సంహారక మందుల వల్ల ఫలితం శూన్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొన్ని దేశాల్లో వీటిని యథేచ్చగా వీధుల్లో చల్లుతున్నారని, దీనివల్ల కరోనా నాశనమవదని పైపెచ్చు మనుషుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. శనివారం డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో.. "వీధులు, మార్కెట్ స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులు చల్లడం ద్వారా అది ధూళి కణాల్లో క్రియారహితంగా మారిపోతుంది. తద్వారా అది కరోనానే కాదు, ఇతర వ్యాధి కారక క్రిములపై కూడా ఏమాత్రం ప్రభావితం చూపలేవు. (కోవిడ్ వ్యాక్సిన్ ధర తక్కువే)
వీధుల్లో కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశముందన్న భావనతో క్రిమి సంహారకాలను అధికంగా స్ప్రే చేస్తున్నారని, దీని వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంద"ని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. అంతేకాక కొన్నిచోట్ల మనుషులపై క్లోరిన్ వంటి రసాయనాలను నేరుగా ప్రయోగిస్తున్నారని దీనివల్ల వైరస్ వ్యాప్తిని నిలువరించగలం అన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. పైగా దీనివల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. (ఆ వైరస్ చావలే.. 40 ఏళ్లుగా బతికే ఉంది?)
Comments
Please login to add a commentAdd a comment