thammineni sitaram
-
ఆ 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసా..
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే చర్యలు: స్పీకర్ తమ్మినేని
గుంటూరు, సాక్షి: ఎన్నికల ముందర అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సాక్షితో స్పందించారు. నిష్పక్షపాతంగా తాను వ్యవహరించానని.. చట్ట ప్రకారమే నడుచుకున్నానని అన్నారాయన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ ముగించాం. విచారణ అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వాదనలు వినిపించేందుకు వాళ్లకు తగిన సమయం ఇచ్చాం. కానీ, వాళ్లు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. కాబట్టే విచారణ ముగించి అనర్హత వేటు వేశాం. ఈ విషయంలో నేను నిష్ఫక్షపాతంగా వ్యవహరించా. చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నా అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీలో చేరినవాళ్లపైనా చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘అనర్హత వేటు పడ్డవాళ్లు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు. మాదీ(అసెంబ్లీని ఉద్దేశించి..) కోర్టు లాంటిదే. ఇక వారిష్టం’’ అని స్పీకర్ తమ్మినేని అన్నారు. -
స్పీకర్ తమ్మినేని సీతారాంతో స్ట్రెయిట్ టాక్
-
గొడవ చేయడం.. ఆపై సస్పెండ్ అవడం..
సాక్షి, అమరావతి: శాసనసభా కార్యక్రమాలకు ఆటంకం కల్పిస్తూ గొడవ చేయడం.. తద్వారా సస్పెండ్ అయి బయటకు వెళ్లిపోవడమే ప్రధాన అజెండాగా టీడీపీ సభ్యులు శనివారం కూడా రచ్చకు దిగారు. పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా ఉన్న అచ్చెన్నాయుడు సహా టీడీపీ సభ్యులందరూ స్పీకర్ పోడియంపైకెక్కి పెద్దపెట్టున నినాదాలు చేయడమే కాకుండా పదేపదే కాగితాలు చింపి స్పీకర్‌పై విసరడం ప్రారంభించారు. స్పీకర్‌కు అడ్డంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయన కుర్చీ చుట్టూ మూగి దాదాపు దాడిచేసేలా వ్యవహరించి సభ సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ ఎంతో ఓపిగ్గా వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా పోడియంపైనే నిలబడి నినాదాలు కొనసాగించారు. చివరకు తమను సస్పెండ్ చేసిన తరువాత టీడీపీ సభ్యులు శాంతించి బయటకు వెళ్లిపోయారు. సభ ప్రారంభం నుంచే.. అసెంబ్లీ శనివారం ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు ప్ల కార్డులతో నినాదాలు చేస్తూ అల్లరి మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారం ఏదైనా ప్రజాసమస్యపై అసెంబ్లీలో అత్యవసరంగా చర్చించాల్సిన అంశంపై మాత్రమే సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి ఉంది. అందుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టడానికి స్పీకర్ తమ్మినేని ఉపక్రమించక ముందునుంచే వారు నినాదాలు మొదలుపెట్టారు. అచ్చెన్నాయుడు సహా టీడీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలిచ్చారు. ఈ సమయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలుగజేసుకుని టీడీపీ సభ్యులకు రోజూ ఇదో అలవాటుగా మారిందని, ఎప్పుడు సస్పెండ్ అయి బయటకు వెళ్లిపోదామా.. అని గొడవ సృష్టిస్తున్నారన్నారు. సీఎం పర్యటనపై వాయిదా తీర్మానం ఇవ్వడమన్నది దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. అసలు వారికి వాయిదా తీర్మానం అర్థం తెలుసా.. అని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నకాలంలో 30 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారని దానిపై చర్చిద్దామా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరింపచేయడానికి ఢిల్లీ వెళ్లారని, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏంచేసేవారో అందరికీ తెలుసునన్నారు. ఆదివారం కూడా అసెంబ్లీ పెడుతున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా.. మంత్రి బుగ్గన స్పందిస్తూ, ఆదివారం సభ పెట్టాలని ప్రతిపాదించింది అచ్చెన్నాయుడేనని, ఆయన్ని గౌరవిస్తూ సీఎం అందుకు అంగీకరిస్తే దానిపై ఇప్పుడు విమర్శించడం సిగ్గుచేటన్నారు. మంత్రి బుగ్గన, దాడిశెట్టి ఆక్షేపణ టీడీపీ సభ్యులు స్పీకర్ ముఖంపైకి పేపర్లు విసిరేయడం పట్ల మంత్రి బుగ్గన సహా అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. టీడీపీ తీరు మారడంలేదని, రోజూ గొడవచేసి బయటకు వెళ్లిపోవడమే వారి అజెండాగా ఉందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. సభను ఆర్డర్లో ఉంచడమో, వాయిదా వేయడమో, లేదంటే వారిని సస్పెండ్ చేయడమో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆయన కోరారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా అచ్చెన్నాయుడు పోడియంపైకి ఎక్కడం సిగ్గుచేటని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. ఎంత చెప్పినా టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో వారిని సస్పెండ్ చేసేలా మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు స్పీకర్, సభ ఆమోదంతో టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. అనంతరం బయటకు వెళ్లిపోయారు. ఐదు ప్రశ్నలు టీడీపీవే.. అయినా.. శాసనసభలో శనివారం చేపట్టిన ప్రశ్నోత్తరాలలో మొదటి ప్రశ్న టీడీపీ సభ్యులదే. మాండమస్ తుపానులో పంట నష్టపోయిన రైతులకు పరిహారం గురించి ప్రశ్న ఉన్నా ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదు. అంతేకాక.. మొత్తం 10 ప్రశ్నల్లో ఐదు టీడీపీ సభ్యులిచ్చిన ప్రశ్నలే. అయినా వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఏమి చెబుతుందో వినకుండా వాయిదా తీర్మానం పేరిట నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. -
కరోనా నుంచి కోలుకున్న ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
-
‘అలా అయితే ముఖ్యమంత్రి ఎందుకు?’
సాక్షి, శ్రీకాకుళం : రాష్ట్ర ఎన్నికల అధికారి పరిపాలనలో జోక్యం చేసుకుంటే ముఖ్యమంత్రి ఎందుకని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంటిసాకులతో ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరును ప్రజలంతా తప్పుబడుతున్నారన్నారు. ఎన్నికలు నిర్వహించే విధి మాత్రమే ఈసీకి ఉంటుందని, ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఏ కలెక్టర్ ఎక్కడ ఉండాలో ఈసీ ఎలా నిర్ణయిస్తుందని, ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో తీర్పు ఆలస్యం అవ్వడం వలన ఎన్నికలు ఆలస్యం అయ్యాయన్నారు. ( అందుకే ఆయన సేవలో..! ) రాజ్యాంగబద్ద వ్యవస్థలు ప్రభావితం చేయబడుతున్నాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్, విధివిధానాలు అమలుచేయడం వరకే ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని చెప్పారు. జాతీయ విపత్తులు ఏర్పడితే ప్రభుత్వ యంత్రాంగం సూచనల మేర నిర్ణయం ప్రకటించాలన్నారు. ‘ఇది కరోనా వైరసా.. కమ్మోనా వైరాసా!!..’ అంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ విధని, పాలనలో జోక్యం చేసుకోకూడదని అన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థల్లో కుట్రదారులు ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ప్రజల మధ్యకు వెళ్లాలని, కుట్రలు చేయకూడదని హితవు పలికారు. ( ఎన్నికల వాయిదా; తెర వెనుక ఏం జరిగింది?! ) చదవండి : ఎన్నికల వాయిదాపై వివరణ కోరిన గవర్నర్ -
పార్టీ ఫిరాయింపుల నిరోధానికి చర్యలు తీసుకోవాలి
-
‘ఫిరాయింపు’ చట్టంలో లోపాలను సరిచేయాలి
సాక్షి, అమరావతి: ‘‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాలను సాకుగా తీసుకుని ఈ చట్టం అమలులోకి వచ్చిన 25 ఏళ్ల తరువాత కూడా యథేచ్ఛగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. ఇలా పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించేందుకు వీలుగా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది’’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. డెహ్రాడూన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న అఖిల భారత చట్టసభల అధ్యక్షుల(ప్రిసైడింగ్ అధికారుల) సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు. ‘ఫిరాయింపుల నిరోధక చట్టం–సంస్కరణల ఆవశ్యకత’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. చట్టంలోని లోపాలను తొలగించకపోతే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఆయన ఉదహరిస్తూ.. రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసేవిగా ఇవి ఉన్నాయన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా అప్పటి సభాపతి వాటిని పట్టించుకోకపోవడం రాజ్యాంగ సూత్రాలను నిర్లక్ష్యం చేయడమేనన్నారు. జగన్ నిర్ణయానికి అన్ని పార్టీలూ మద్దతు తెలపాలి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయకుండా పార్టీలోకి ఇతర పక్షాలకు చెందిన ఏ సభ్యుడిని అనుమతించబోనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విలువలతో కూడుకున్న నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని తమ్మినేని కోరారు. పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ప్రతి ఫిర్యాదును కచ్చితంగా ఇన్ని రోజుల వ్యవధి లోపల పరిష్కరించి తీరాలన్న నిబంధనను చట్టంలో చేర్చాలని సూచించారు. ‘స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడం’ అన్న అంశానికి కచ్చితమైన నిర్వచనాన్ని కూడా చట్టంలో పొందుపర్చాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ‘విలీన’ నిబంధనను కూడా స్పష్టంగా నిర్వచించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. సభాపతులు సరైన న్యాయబద్ధమైన నిర్ణయాలను తీసుకోక పోవడం వల్లే స్పీకర్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందన్నారు. 18, 19 తేదీల్లో నిర్వహించిన ఈ సదస్సులో చట్టసభల నిర్వహణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. -
డిసెంబర్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. సమావేశాలు 10 నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో స్పీకర్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ కార్యకలాపాల కంప్యూటరీకరణ మూడు దశల వరకు పూర్తయిందని, పూర్తి డిజిటలైజేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలను డిసెంబర్ 17లోపు కేంద్రానికి పంపాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. వచ్చే నెల 15 నుంచి 21 వరకు డెహ్రాడూన్‌లో స్పీకర్ల సదస్సు జరగనుందని, ఇటీవల కంపాలలో జరిగిన పలు దేశాల స్పీకర్ల సమావేశంలో చేసిన తీర్మానాల అమలుపై ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి అస్సాం అసెంబ్లీ స్పీకర్ చైర్మన్‌గా, తాను సభ్యుడిగా మొత్తం ఏడుగురితో కూడిన సబ్‌కమిటీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారని తెలిపారు. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చెప్పారు. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయమై మీడియా ప్రశ్నించగా.. ఆ ఎమ్మెల్యేను ఇక ఇండిపెండెంట్‌గా పరిగణించవచ్చని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. -
స్పీకర్ తమ్మినేనిపై టీడీపీ దుర్భాషలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ వ్యక్తిగత దూషణలకు దిగింది. మాటల్లో చెప్పలేని.. రాయలేని భాషలో ఆయనను దారుణంగా తూలనాడుతూ టీడీపీ అధికారిక ఈ–పేపర్లో కథనం ప్రచురించింది. అందులో స్పీకర్‌ను ‘దున్నపోతు, ఆంబోతు’ అంటూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. శాసనసభ స్పీకర్‌కు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా దారుణ పదాలతో దూషణలకు పాల్పడింది. ‘దున్నపోతులా సాంబార్ తాగొచ్చి అసెంబ్లీలో నిద్రపోతాడు.. జనం ముందు బయటకు వచ్చి ఆంబోతులా రంకెలేస్తుంటాడు.. నీది కూడా ఒక బ్రతుకేనా’ అంటూ నీచత్వానికి ఒడిగట్టింది. -
‘గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులు’
సాక్షి, శ్రీకాకుళం : గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులని, గ్రామీణ పాలనా వ్యవస్థకు మూలమని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి ఆరా తీస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీలంక, మలేషియా దేశాల నుంచి కూడా పరిశీలనకు సిద్ధమయ్యారని తెలిపారు. సోమవారం పొందూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4.50 లక్షల వాలంటీర్లు, 1.50 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ రాష్ట్ర, దేశ చరిత్రలో గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాలని, ప్రస్తుతం అదే జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి మనసుతో పాలన చేస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం కోసం శాసనసభలో చట్టాలను తీసుకువచ్చామని, వచ్చే శాసనసభలో 50 శాతం మహిళలతో నిండిపోతుందని అన్నారు. ప్రతీ గ్రామ సచివాలయాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీపీఎస్సీ, ఎక్సైజ్, డీఎస్సీ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. తన విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని, ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయనని స్పష్టం చేశారు. -
శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు
-
ఇచ్ఛాపురం బహిరంగసభకు తరలిరండి
-
‘జగన్‌కు జనాదరణ చూడలేకే ఇలా చేస్తున్నారు’
సాక్షి, ఆముదాలవలస: ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను ఓర్వలేక టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుటుంబంపై చేస్తున్ననిరాధార ఆరోపణలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆముదాలవలస బహిరంగ సభలో వైఎస్ జగన్ అసత్యాలు మాట్లాడారన్న ప్రభుత్వ విప్ కూన రవి వ్యాఖ్యలను తమ్మినేని ఖండించారు. ‘సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు మా నాయకుడిపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే. అందుకే న్యాయదేవత ముందు ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. దైర్యముంటే కూన రవి అక్రమాలపై విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి బహిరంగ విచారణకు రావాలి. టీడీపీ నేతల ఆరోపణలపై చర్చించడానికి మేము సిద్దం. ల్యాండ్ మాఫియా, స్యాండ్ మాఫియా చేసిన చరిత్ర తెలుగుదేశం నేతలది. వెన్నెల వలసలో త్రిపుల్ ఐటీకి 50 ఎకరాల స్థలం లేదన్న కూన రవి.. పూల సాగుకు కోసం 99 ఎకరాలు కేటాయించడానికి ఎలా ప్రతిపాదన చేసారు’ అని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
పట్టభద్రులే బుద్ధి చెప్పాలి
► హామీలు అమలు చేయని టీడీపీ, బీజేపీలకు ఓటుతో బుద్ధి చెప్పండి ► పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ► వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని శ్రీకాకుళం అర్బన్: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీలు ఓట్లు అడుగుతున్నాయని, అసలు ఏం చేశారని ఓటు అడుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాన్ని ముక్కలు చేసినందుకా, లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదన్నందుకా, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలు తుంగలో తొక్కినందుకా..? ఎందుకు ఓటు వేయాలని అడిగారు. అమలు చేయని హామీలపై టీడీపీ నాయకులు, ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు ప్రజల ముందు నిలబడి సమాధానం చెప్పి ఆ తర్వాత ఓట్లు అడగాలన్నారు. పట్టభద్రులే వీరికి బుద్ధి చెప్పాలని కోరారు. అజశర్మకు పూర్తి మద్దతు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం గా జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పీడీఎఫ్ అభ్యర్థి ఎ.అజశర్మకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తోందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, జిల్లాలోని పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యతా ఓటును అజ శర్మకు వేసి గెలిపిం చాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. పొత్తు ధర్మానికి తూట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ–బీజేపీ ఉమ్మడి అభ్యర్థి íపీవీఎన్ మాధవ్‌ను నిలబెట్టి ఓట్లు వేయాలని ఆయా పార్టీల నాయకులు ఒకవైపు అడుగుతున్నారని, మరోవైపు ఆమదాలవలస టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతాడ రవికుమార్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిపి ఆయనకు ఓటు వేయాలని అ డుగుతున్నారని, ఇది మిత్ర ధర్మమా? లేక మిత్ర ద్రో హమా? అని ఆయన ప్రశ్నించారు. స్నేహ ధర్మానికి తూట్లు పొడిచి బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఎన్ని ధనుంజయ్, టి.కామేశ్వరి పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తోందని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరుగని పోరాటాలు చేశారని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కలుగుతుందని తెలిపారు. విభజన ద్వారా జరిగిన నష్టాన్ని ప్యాకేజీ ద్వారా పూరిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం శోచనీయమన్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్యులు జేబులు నింపుకునేందుకే ఉప యోగపడుతుందని ఆరోపించారు. -
లోకేష్‌పై ప్రమాణం చేయగలరా?
ఓటుకు కోట్లు కేసులో ఫోన్ సంభాషణలలో ఉన్న గొంతు చంద్రబాబుదేనని దేవుడి ముందు తన కొడుకుపై ప్రమాణం చేస్తానని వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు తాను ఆ ప్రమాణాలు చేస్తానని, అదే.. ఆ గొంతు మీది కాదని మీరు లోకేష్‌పై ప్రమాణం చేయగలరా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చగానే అక్కడ పిడుగులు పడి.. 20 మంది చనిపోయారని తమ్మినేని అన్నారు. ఏపీలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు.. రైతు రుణమాఫీ పేరు చెప్పి రైతులకు ఒక్క రూపాయి కూడా కొత్త రుణాలు ఇవ్వలేదని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సందర్భాలలో రైతులకు మీరిస్తున్న హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఒక్కసారైనా సమీక్షించుకున్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. మీరు రుణమాఫీ చేశానని చెబుతున్నారు గానీ, రైతులు గుండెమంటలతో రగిలిపోతున్నారు మీరు చాలా హామీలిచ్చారు.. వాటిని ప్రస్తుతానికి వదిలేద్దాం. సమయం వచ్చినప్పుడు వాటి విషయం చూద్దాం రుణమాఫీ పేరుతో కొత్తరుణాలు లేకుండా చేశారు దానికి బాధ్యత మీరు వహిస్తారా.. సింగపూర్ లాంటి ఏజెన్సీ ఏదైనా బాధ్యత వహిస్తుందా ఈ సంవత్సరం పీఈసీఎస్ల నుంచి ఒక్కరూపాయి కూడా రైతుకు కొత్త రుణం ఇవ్వలేదు దీనికి మంత్రులు గానీ, సీఎం గానీ సమాధానం ఇవ్వాలి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకపోతే ఏం చేస్తారు? 692 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అన్నారు.. ఒక్కరూపాయైనా విడుదల చేశారా? మీరు చేసిన సందర్భం ఉంటే చెప్పండి.. శ్రీశైలం డ్యామ్‌కు సంబంధించి నీటిమట్టం డెడ్ స్టోరేజి లెవెల్ కంటే కిందకు పడిపోయింది. దాంతో ఎక్కడా పంటలకు చుక్క నీరిచ్చే పరిస్థితి లేదు పైనున్న కర్ణాటక దామాషా ప్రకారం నీరు వదలడం లేదు. కేంద్రంలో కూడా మీ మంత్రులున్నారు కాబట్టి ఢిల్లీ వెళ్లి రైతుల దుస్థితి గురించి, నీళ్ల సమస్య గురించి మాట్లాడారా దానివల్ల ప్రకాశం బ్యారేజిలో నీళ్లు లేవు, ఏలేరు రిజర్వాయర్, తుంగభద్ర నుంచి వచ్చే కాలువలకు కూడా నీళ్లు లేవు. వంశధారలో నీళ్లు లేవు, తోటపల్లిలోకూడా నీళ్లు లేని పరిస్థితి. -
ఒక్క రూపాయైనా కొత్త రుణాలు ఇచ్చారా?