
స్పీకర్ తమ్మినేని సీతారాంను తీవ్రంగా దూషిస్తూ సోమవారం తమ అధికారిక ఈ–పేపర్‌లో టీడీపీ ప్రచురించిన కథనం
సాక్షి, అమరావతి: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ వ్యక్తిగత దూషణలకు దిగింది. మాటల్లో చెప్పలేని.. రాయలేని భాషలో ఆయనను దారుణంగా తూలనాడుతూ టీడీపీ అధికారిక ఈ–పేపర్‌లో కథనం ప్రచురించింది. అందులో స్పీకర్‌ను ‘దున్నపోతు, ఆంబోతు’ అంటూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. శాసనసభ స్పీకర్‌కు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా దారుణ పదాలతో దూషణలకు పాల్పడింది. ‘దున్నపోతులా సాంబార్ తాగొచ్చి అసెంబ్లీలో నిద్రపోతాడు.. జనం ముందు బయటకు వచ్చి ఆంబోతులా రంకెలేస్తుంటాడు.. నీది కూడా ఒక బ్రతుకేనా’ అంటూ నీచత్వానికి ఒడిగట్టింది.
Comments
Please login to add a commentAdd a comment