విజయసాయి రెడ్డిపై అనర్హత పిటిషన్‌ కొట్టివేత | Ramnath Kovind Dismiss Disqualification Petition On Vijayasai Reddy | Sakshi
Sakshi News home page

ఈసీ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి నిర్ణయం

Published Mon, Sep 7 2020 7:56 PM | Last Updated on Mon, Oct 5 2020 5:56 PM

Ramnath Kovind Dismiss Disqualification Petition On Vijayasai Reddy - Sakshi

న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ని రాషష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం కొట్టేశారు. ఆయనపై అనర్హత వర్తించదని కోవింద్‌ స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి లాభదాయక పదవి నిర్వహిస్తున్నారంటూ దాఖలైన ఫిర్యాదుపై రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకున్నారు. పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం, న్యాయస్థానాల తీర్పు మేరకు అనర్హత వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి, విజయసాయి రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ని కొట్టివేశారు. జీవో 75 ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోవడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విధినిర్వహణలో, ఏపీ పర్యటనలో కేవలం రాష్ట్ర అతిథిగా మాత్రమే ఉన్నారని జీవోలో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement