రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తీర్పుపై సీఏఎస్ వివరణ
క్రీడాకారులు నిబంధనలు తెలుసుకోవాలని సూచన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) సూచించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయగా... కేవలం వంద గ్రాములే కదా దీన్ని మినహాయించండి అని భారత అథ్లెట్ సీఏఎస్‌ను ఆశ్రయించింది.
వాదనలు విన్న అనంతరం తీర్పును పలుమార్లు వాయిదా వేసిన సీఏఎస్ ఈనెల 14న వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు ఇచి్చంది. ఇప్పుడు తాజాగా దీనిపై వివరణ ఇచి్చంది. ‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిరీ్ణత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే.
అందుకే పోటీపడే కేటగిరీ కంటే కాస్త తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న అథ్లెట్ (వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి) తాను అధిక బరువు ఉన్నానని స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు.
అయితే ఆమె అభ్యర్థన ఏంటంటే.. 100 గ్రాములు బరువు ఎక్కువ కాదని.. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని.. తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని.. మినహాయింపు ఇవ్వాలని కోరింది’ అని సీఏఎస్ సోమవారం వివరణ ఇచి్చంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన వినేశ్.. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై ఒలింపిక్ పతకానికి దూరమైంది. తొలి రోజు పోటీల్లో నిరీ్ణత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... క్యూబా రెజ్లర్ గుజ్‌మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసింది.
పలు అంతర్జాతీయ టోర్నీల్లో రెండు కేజీల అధిక బరువు ఉన్నా యూడబ్ల్యూడబ్ల్యూ వారిని అనుమతిస్తోందని.. దీంతో వంద గ్రాములే కాబట్టి మినహాయించాలని సీఏఎస్‌లో అప్పీలు చేసింది. దీనికి భారత ఒలింపిక్ కమిటీ మద్దతిచ్చి నిష్ణాతులైన న్యాయ నిపుణులను నియమించింది. అయినా నిబంధనలు అందరికీ ఒక్కటే అని స్పష్టం చేసిన సీఏఎస్.. వినేశ్ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై విజయంతో సంచలనం సృష్టించడంతో పాటు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కిన వినేశ్‌కు నిరాశే ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment