విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్‌పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది.
ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్.
అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషేన్ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్, స్పీకర్‌లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment