
అమరావతి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12 న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీరికి తాజాగా నోటీసులు జారీ చేసిన స్పీకర్.. ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment