సాక్షి, మహబూబ్ నగర్: గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పుపై డీకే అరుణ స్పందించారు. తీర్పు ఆలస్యమైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని అన్నారామె.
‘‘తీర్పు ఆలస్యమైన న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు ఈ తీర్పును స్వాగతిస్తారు.. గౌరవిస్తారు. ప్రభుత్వం కూడా బేషజాలకి పోకుండా కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆర్జర్ కాపీ రాగానే ఎలక్షన్ కమీషనర్, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ ను కలుస్తాను’’ అని తెలిపారామె.
ఇక.. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈవీఎం వివిపాట్లను మానిప్లేట్ చేయటం, స్థిర చరస్తుల వివరాలు సరిగా ప్రకటించకపోవడం, వాహనంపై ఉన్న చలాన్ ను కట్టకపోవడం పై కోర్టు నాపై అనార్హత వేటు వేసింది. ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి నోటీసులు ముందుగా అందలేదు. కోర్టు తీర్పు కూడా ఏకపక్షంగా వచ్చింది. ఈ అనర్హత వేటుపై పైకోర్టుకు వెళ్తాను’’ అని తెలిపారాయన.
గద్వాలకు పొలిటికల్ టూరిస్టులు ఎక్కువని.. గద్వాల కచ్చితంగా తన అడ్డేనన్న కృష్ణమోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత వార్త: గద్వాల ఎమ్మెల్యేపై అనర్హత.. తీర్పు కాపీలో ఏముందంటే..
Comments
Please login to add a commentAdd a comment