Gadwal Assembly Constituency
-
గద్వాల్ పబ్లిక్ మేనిఫెస్టో
-
బీఆర్ఎస్ టైం అయిపోయింది: అమిత్ షా
సాక్షి, గద్వాల: తెలంగాణలో రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీలకు తీవ్ర అన్యాయం చేశానని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీనే సీఎం చేస్తుందని హామీ ఇచ్చారాయన. శనివారం మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదు. గద్వాల పేదలకు 500 ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారు. అబద్ధపు మాటలతో కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ టైం అయిపోయింది.. బీజేపీ టైం వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది’’ అని షా ప్రసంగించారు. ‘‘కేసీఆర్ హయాంలో స్కామ్లెన్నో వెలుగులోకి వచ్చాయి. మిషన్ భగీరథ, కాళేశ్వరం, మద్యం కుంభకోణాలు బయటపడ్డాయి. దేశంలోనే కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే టైం వచ్చింది. ..కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసింది. కాంగగ్రెస్ హయాంలో ఉమ్మడి ఏపీకి 2 లక్షల కోట్లు ఇస్తే.. కేవలం తెలంగాణకే మోదీ ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లు ఇచ్చింది. కానీ, కేసీఆర్ ప్రభుత్వం నిధుల్ని సక్రమంగా వినియోగించలేదు’’ అని షా ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అంతా ఒక్కటే. కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీలకు అనుకున్నంత స్థాయిలో టికెట్లు ఇవ్వలేదు. అవి బీసీ వ్యతిరేక పార్టీలు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీజేపీకి ఓటేస్తే.. బీసీని సీఎం చేస్తాం. ఒక బీసీని ప్రధానిని చేసిన పార్టీ బీజేపీ. కేంద్రంలో 20 మందికిపైగా ఓబీసీలను మంత్రులను చేశాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. ఆ రద్దు చేసిన రిజర్వేషన్లు ఎస్టీలకు, ఓబీసీలకు ఇస్తాం. తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. పేపర్ లీకేజీ కారణంగానే ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఎంఐఎంకి లొంగిపోయి.. ఎందుకు విమోచన దినోత్సవం జరపడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా విమోచన దినోత్సవంగా జరుపుతాం. బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి. బీజేపీని గెలిపిస్తే.. అయోధ్య రామమందిర ఉచిత దర్శనం కల్పిస్తాం’’ అని షా ప్రసంగాన్ని ముగించారు. -
వాదం.. ఎవరికి ఆమోదం! సీడ్ మాఫియాతో చీకటి ఒప్పందం..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఎవరికి వారు వ్యూహాత్మకంగా అడుగులేస్తుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14 నియోజకవర్గ స్థానాలు ఉండగా.. ఎక్కడా లేని విధంగా గద్వాలలో తెరపైకి వచ్చిన బహుజన వాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 70 ఏళ్ల చరిత్రలో ఈసారి ఎన్నికల్లో డీకే అరుణ కుటుంబం పోటీకి దూరంగా ఉండగా.. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీతో పాటు ఏఐఎఫ్బీ పార్టీలు నువ్వా.. నేనా అన్నట్లు పోటాపోటీగా ఎన్నికల పోరులో దూసుకెళ్తున్నాయి. సోషల్ మీడియాను సైతం ఆయా పార్టీల అభ్యర్థులు విస్తృతంగా వినియోగించుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు తమకు అనుకూల పోస్టులతో హల్చల్ చేస్తుండగా.. హస్తం అభ్యర్థి స్థానికత హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు.. గద్వాలో కాంగ్రెస్‌కు ప్రధానంగా ఊపిరిపోసిన బహుజనవాదం.. అభ్యర్థి, ముఖ్య నేతల వ్యవహార శైలి, కాలక్రమంలో మారుతున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి గుదిబండగా మారినట్లు తెలుస్తోంది. సీడ్ మాఫియాతో చీకటి ఒప్పందం.. నడిగడ్డ రాజకీయాల్లో సీడ్ మాఫియాది ప్రత్యేక స్థానం. ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్న వారు ఏళ్లకేళ్లుగా తమకు అనుకూలమైన అభ్యర్థులకు వంతపాడడమే కాకుండా.. వారికి ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నట్లు ఇదివరకే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా సీడ్, రియల్, మట్టి తదితర మాఫియాను పారదోలుతామని స్థానిక కాంగ్రెస్ నేతలు పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ముందు ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి జెడ్పీచైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరగా.. ఆమెనే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల క్రమంలో సీడ్ మాఫియా నేతలతో వారు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడం చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. సబ్ ఆర్గనైజర్లతో అంటకాగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారగా.. నడిగడ్డ రైతుల్లో కాకరేపుతోంది. మైనస్‌గా మారుతోందా? కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లక్ష్యంగానే కొనసాగుతున్నట్లు గద్వాల పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. పార్టీలో అనేక ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకే బాధ్యతలు అప్పగించడం మైనస్‌గా మారు తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కే చెందినప్పటికీ తాము ఓటర్లం కాదన్నట్లు వ్యవహరిస్తుండడం మల్దకల్‌తో పాటు పలు మండలాలకు చెందిన కుటుంబాలు మథనపడు తుండగా.. జనంలో బహుజన వాదం.. ఎవరికి ఆమోదమనే చర్చ జోరుగా సాగుతోంది. ఏఐఎఫ్బీ పదునైన విమర్శలు..! ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగళ్ల రంజిత్‌కుమార్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై పదునైన ఆరోపణస్త్రాలు సంధిస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా సరిత నాలుగేళ్ల పాటు అధికార పార్టీలో ఉంటూ ఏ ఒక్క రోజు కూడా బహుజనుల కోసం భుజం కాసింది లేదని.. ఎందరో బలైనా వారి తరఫున కనీసం ప్రశ్నించిన దాఖల లేవని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నాలుగేళ్ల పాటు అధికార పార్టీలో అధికారాన్ని అనుభవించి కేవలం అధికారం కోసం జిమ్మక్కులు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. సీడ్ మాఫియా, రెడ్లతో మిలాఖత్ అయ్యి గద్వాలలో బహుజనవాదాన్ని సమాధి చేయడానికే పోటీ చేస్తున్నారనే ఘాటైన విమర్శనాస్త్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం మెజార్టీ బహుజన వాదుల్లో తీవ్ర చర్చకు దారితీయగా.. కాంగ్రెస్‌కు ఇరకాటం తెచ్చిపెట్టినట్లయింది. కాంగ్రెస్‌లో అభ్యర్థి ప్రకటన సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు టికెట్ కొనుక్కున్న నాయకురాలు ప్రజాసేవ చేయగలదా.. గద్వాలలో బహుజనవాదాన్ని సమాధి చేయడానికే ఆమె వచ్చిందంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల తొలి ఘట్టం ముగిసిన క్రమంలో సోషల్ మీడియాలో ఫొటోలు, పేర్లతో సహా కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇవి కూడా చదవండి: ఆయనకు ఓటమి కనిపిస్తోంది..! : పువ్వాడ అజయ్‌కుమార్ -
అసెంబ్లీలో డీకే అరుణకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: గద్వాల నియోజకవర్గంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన కోర్టు.. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ అందించి.. తనను ఎమ్యెల్యేగా గుర్తించాలని కోరేందుకు శుక్రవారం అసెంబ్లీకి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లారు. గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శి కి అందించడానికి వెళ్లారామె. అయితే ఆ సమయంలో కార్యదర్శితో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా అందుబాటులో లేరు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ‘‘ 24న ఈ తీర్పు వచ్చింది, ఆర్డర్ కాపీ తో స్పీకర్ ను కలవడానికి వస్తే.. స్పీకర్, కార్యదర్శి ఇద్దరూ లేరు. నిన్న సాయంత్రం ఫోన్ చేశాను. మెసేజ్ కూడా పెట్టాను. రోజూ అసెంబ్లీకి వచ్చే కార్యదర్శి ఇవాళ మాత్రం ఎందుకనో రాలేదు.కార్యదర్శి పై ప్రభుత్వ ఒత్తిడి ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం ఉంది స్పీకర్ దగ్గర సమావేశం ఉందని కార్యదర్శి వెళ్లారట. ముందు సమాచారం ఇచ్చిన వీరిద్దరూ లేకపోవడం బాధాకరం. అందుకే కోర్టు ఆర్డర్ కాపీని స్పీకర్ పేషీలో ఇచ్చాం. అసెంబ్లీ స్పీకర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పును అమలు చేయాలి. ఈ తీర్పు నాలుగేళ్ల కింద వస్తె నా గద్వాల ను అభివృద్ది చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ చాలా ఆలస్యంగా ఈ తీర్పు వచ్చింది ఎన్నికల సంఘాన్ని కలుస్తాం ‘‘గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే గా డీకే అరుణ తీర్పు వచ్చింది. దీనిపై సోమవారం భారత ఎన్నికల ప్రధాన అధికారి ని కలుస్తాం. డీ కే అరుణ విషయంలో వచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది’’అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. -
ఆలస్యమైనా న్యాయం జరిగింది: డీకే అరుణ
సాక్షి, మహబూబ్ నగర్: గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పుపై డీకే అరుణ స్పందించారు. తీర్పు ఆలస్యమైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని అన్నారామె. ‘‘తీర్పు ఆలస్యమైన న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు ఈ తీర్పును స్వాగతిస్తారు.. గౌరవిస్తారు. ప్రభుత్వం కూడా బేషజాలకి పోకుండా కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆర్జర్ కాపీ రాగానే ఎలక్షన్ కమీషనర్, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ ను కలుస్తాను’’ అని తెలిపారామె. ఇక.. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈవీఎం వివిపాట్లను మానిప్లేట్ చేయటం, స్థిర చరస్తుల వివరాలు సరిగా ప్రకటించకపోవడం, వాహనంపై ఉన్న చలాన్ ను కట్టకపోవడం పై కోర్టు నాపై అనార్హత వేటు వేసింది. ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి నోటీసులు ముందుగా అందలేదు. కోర్టు తీర్పు కూడా ఏకపక్షంగా వచ్చింది. ఈ అనర్హత వేటుపై పైకోర్టుకు వెళ్తాను’’ అని తెలిపారాయన. గద్వాలకు పొలిటికల్ టూరిస్టులు ఎక్కువని.. గద్వాల కచ్చితంగా తన అడ్డేనన్న కృష్ణమోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. సంబంధిత వార్త: గద్వాల ఎమ్మెల్యేపై అనర్హత.. తీర్పు కాపీలో ఏముందంటే.. -
జోగులాంబ గద్వాల్లో ప్రజల ఓట్లను ఎవరు గెలుస్తారు?
గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి డి.కె.అరుణపై 28260 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గద్వాలలో గట్టి నేతగా పేరున్న అరుణ 2018లో తనకు మేనల్లుడు అయ్యే కృష్ణవెెూహన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత అరుణ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బారతీయ జనతా పార్టీలో చేరడం విశేషం. కృష్ణమోహన్ రెడ్డికి 100415 ఓట్లు రాగా అరుణకు 72155 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇక్కడ ఎస్.ఎప్.బి తరపున పోటీచేసిన అబ్దుల్ మొహిన్ ఖాన్ ఏడువేల ఓట్లకు పైగా తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన డి.కె.అరుణ మూడుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికయ్యాక డాక్టర్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవిని పొందారు. తదుపరి రోశయ్య, కిరణ్‌ల మంత్రివర్గాలలో కొనసాగారు. 2014లో ఆమె తన మేనల్లుడు టిఆర్ఎస్ అభ్యర్ధి అయిన కృష్ణమోహన్‌రెడ్డిపై 8260 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. గద్వాలలో పదిహేను సార్లు రెడ్డి సామాజిక వర్గం ఎన్నికైంది. ఒకసారి మాత్రం బిసి (బోయ) ఎన్నికయ్యారు. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు గెలిచినా, కోర్టు తీర్పు కారణంగా ఒకసారి కాంగ్రెస్ ఐ వశం అయింది. ఒకసారి టిఆర్ఎస్, ఒకసారి జనతా, ఒకసారి సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధి గెలుపొందారు. మూడుసార్లు ఇండి పెండెంట్లు గెలిచారు. డి.కె. అరుణ 2004లో కాంగ్రెస్ ఐ టిక్కెట్ రాకపోవడంతో సమాజవాది పక్షాన పోటీచేసి గెలుపొంది కాంగ్రెస్ ఐ అనుబంధ సభ్యులయ్యారు. గద్వాలలో డి.కె. కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబానికి చెందిన సత్యారెడ్డి రెండుసార్లు, ఈయన పెద్ద కుమారుడు డి.కె.సమరసింహారెడ్డి నాలుగుసార్లు, రెండో కుమారుడు భరతసింహారెడ్డి ఒకసారి, భరతసింహారెడ్డి భార్య అరుణ మూడుసార్లు గెలుపొందారు. అంటే మొత్తం తొమ్మిది సార్లు ఈ కుటుంబీకులే గెలుపొందారు. అయితే 1994లో అన్నదమ్ములిద్దరూ పోటీపడితే టిడిపి మద్దతుతో ఇండిపెండెంటుగా ఉన్న భరత్ సింహారెడ్డి గెలవగా, 1999లో బావా మరదళ్ళు పోటీపడి ఇద్దరూ పరాజితులయ్యారు. ఒకసారి టిడిపి అభ్యర్ధి గట్టు భీముడు గెలుపొందారు. 2004,2009లో అరుణ గెలుపొందారు. 2009లో డి.కె. అరుణ, ఆమెకు మేనల్లుడు అయ్యే టిడిపి పక్షాన కృష్ణమోహన్‌రెడ్డి పోటీపడటం విశేషం. 2014లో ఆయన టిఆర్ఎస్లోకి మారారు కాని ఫలితం దక్కలేదు. 2018లో గెలవగలిగారు. 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచిన గోపాల్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, సమరసింహారెడ్డి ఎన్నికైనట్లు కోర్టు ప్రకటించింది. డి.కె. సమరసింహారెడ్డి గతంలో చెన్నా, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. ఇక్కడ ఒకసారి గెలిచిన పి.పుల్లారెడ్డి అలంపూర్‌లో రెండుసార్లు గెలుపొందారు. కాగా మాజీమంత్రి డి.కె. సమరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరడం విశేషం. కాని2004లో ఇక్కడ బిజెపి మిత్రపక్షం పోటీచేయడంతో ఆయనకు అవకాశం రాలేదు.దాంతో ఆయన ఆ పార్టీని వదలివేశారు. గద్వాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..