సాక్షి, హైదరాబాద్: గద్వాల నియోజకవర్గంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన కోర్టు.. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ అందించి.. తనను ఎమ్యెల్యేగా గుర్తించాలని కోరేందుకు శుక్రవారం అసెంబ్లీకి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లారు. గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శి కి అందించడానికి వెళ్లారామె. అయితే ఆ సమయంలో కార్యదర్శితో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా అందుబాటులో లేరు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
‘‘ 24న ఈ తీర్పు వచ్చింది, ఆర్డర్ కాపీ తో స్పీకర్ ను కలవడానికి వస్తే.. స్పీకర్, కార్యదర్శి ఇద్దరూ లేరు. నిన్న సాయంత్రం ఫోన్ చేశాను. మెసేజ్ కూడా పెట్టాను. రోజూ అసెంబ్లీకి వచ్చే కార్యదర్శి ఇవాళ మాత్రం ఎందుకనో రాలేదు.కార్యదర్శి పై ప్రభుత్వ ఒత్తిడి ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం ఉంది స్పీకర్ దగ్గర సమావేశం ఉందని కార్యదర్శి వెళ్లారట. ముందు సమాచారం ఇచ్చిన వీరిద్దరూ లేకపోవడం బాధాకరం. అందుకే కోర్టు ఆర్డర్ కాపీని స్పీకర్ పేషీలో ఇచ్చాం. అసెంబ్లీ స్పీకర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పును అమలు చేయాలి. ఈ తీర్పు నాలుగేళ్ల కింద వస్తె నా గద్వాల ను అభివృద్ది చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ చాలా ఆలస్యంగా ఈ తీర్పు వచ్చింది
ఎన్నికల సంఘాన్ని కలుస్తాం
‘‘గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే గా డీకే అరుణ తీర్పు వచ్చింది. దీనిపై సోమవారం భారత ఎన్నికల ప్రధాన అధికారి ని కలుస్తాం. డీ కే అరుణ విషయంలో వచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది’’అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment