
దేశ స్వరం కోసం నేను పోరాడుతున్నానని.. ఈ పోరాటంలో..
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎంపీగా తనపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ కీలక నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. దేశ స్వరం కోసం తాను పోరాడుతున్నానని, ఎంత మూల్యం చెల్లించుకోవడానికైనా నేను సిద్ధం అంటూ హిందీలో ట్వీట్ చేశారాయన.
2019లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం కేసులో.. తాజాగా గుజరాత్ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే.. 30 రోజుల గడువుతో తీర్పును సవాల్ చేసేందుకు ఆయనకు అవకాశం కూడా కల్పించింది. ఈలోపు ఆయన తీర్పుపై అప్పీల్‌గానీ, లేదంటే సూరత్ కోర్టు ఆదేశాలపై స్టే తెచ్చుకునేందుకు అవకాశం లభించినట్లయ్యింది. కానీ,
ఈలోపే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఆయనపై లోక్‌సభ సెక్రటేరియెట్ అనర్హత వేటు వేసింది. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. దీంతో 52 ఏళ్ల వయసున్న రాహుల్ గాంధీ తనకు ఢిల్లీలో కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను నెలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇక.. ఎన్నికల సంఘం వయనాడ్ స్థానానికి ఎన్నిక నిర్వహించడమే తరువాయి.
मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं।
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023
मैं हर कीमत चुकाने को तैयार हूं।