
సాక్షి,కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ సుస్థిరత కోసమే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం(జులై 15) కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవంలో మొక్కలు పొన్నం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు.
‘దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలు కూల్చింది..? బండి సంజయ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు..? ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. చూస్తూ ఊరుకోవాలా..?
మేం ధర్మం తప్పలేదు. కులగణనపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. డిసెంబర్ 3 వరకు మాకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదు. తర్వాత పరిస్థితుల్లోనే చేర్చుకుంటున్నాం’అని పొన్నం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment