సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం(నవంబర్ 12) రిజర్వు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై వాద, ప్రతివాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది.
కాగా, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ అనర్హతపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు.
ఇదీ చదవండి: మరో నలుగురు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment