
కామేపల్లి: కాంగ్రెస్ పార్టీ ని వీడిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే గ్రామాల్లో పర్యటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్రాలలో టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోత్ శివ, ప్రేమ్‌కుమార్, మరికొందరిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉందన్నారు. ఎమ్మెల్యే హరిప్రియను గోవింద్రాల గ్రామానికి చెందిన మహిళలు కాంగ్రెస్‌ని ఎందుకు వీడారని, తమను ఎందుకు మోసం చేశారని ప్రశ్నిస్తే.. మహిళలు అని కూడా చూడకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయించడం దారుణమన్నారు.