కాంగ్రెస్‌కు షాక్!.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు | Six Congress MLAs Join to BJP of Himachal Pradesh | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్!.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

Mar 23 2024 3:33 PM | Updated on Mar 23 2024 4:48 PM

Six Congress MLAs Join to BJP of Himachal Pradesh - Sakshi

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగటానికి ముందే పార్టీలు మారుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. అటు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి.. ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి అభ్యర్థులు చేరుతున్నారు. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఒకేసారి ఆరుమంది రెబల్ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలోకి చేరారు.

''సుధీర్ శర్మ, రవి ఠాకూర్, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవేంద్ర భుట్టో, రాజేంద్ర రాణా, చైతన్య శర్మ''లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజీవ్ బిందాల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చలేకపోయామని, అందుకే పార్టీ మారి ప్రజలకు మేలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సీఎం నియంతలా మారి ప్రజలను అవమానిస్తున్నారని, ఎమ్మెల్యేల మాట వినడం లేదని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. హిమాచల్ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం, ఆయన అనుచరుల పాలన సాగుతోందని వెల్లడించారు.

హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ తమదైన రీతిలో ప్రచారాలు మొదలుపెట్టేశాయి. నిజానికి బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు ఓటు వేసిన ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో వీరు బీజేపీ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement