![Six More Brs Mlas Are Likely To Join The Congress](/styles/webp/s3/article_images/2024/07/11/Six-More-Brs-Mlas-Are-Likel.jpg.webp?itok=xSduvyJo)
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ పాలిటిక్స్ రసవత్తరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. కారు దిగడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యేతో చేరికలు షూరూ అయ్యింది. గ్రేటర్‌లో రోజుకో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జంపింగ్‌కు స్కెచ్ సిద్ధమయ్యింది. ఇప్పటికే కార్యకర్తలతో పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
హైదరాబాద్ శివారులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు పూర్తయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజుకో ఎమ్మెల్యే, 20 మంది ముఖ్యనేతలు చేరికకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment