
మాట్లాడుతున్న నాగమణి
అశ్వారావుపేటరూరల్: కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని టీపీసీసీ మహిళా జనరల్ సెక్రటరీ సున్నం నాగమణి అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేశారని, కానీ కొంతమంది ప్రజల నమ్మకాన్ని అధికార పార్టీకి అమ్ముకుంటూ, స్వలాభాల కోసమే ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజనులకు దాదాపు 3లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందాయని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కుడా పట్టా ఇవ్వలేదన్నారు. హరితహారం పథకం పేరుతో గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములను బలవంతంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment