సాక్షి,హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై బీఆర్‌ఎస్ యాక్షన్ మొదలుపెట్టింది. కోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం(సెప్టెంబర్11) అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు.
బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నెలరోజుల్లో చర్య తీసుకోవాలని, లేదంటే తామే సుమోటోగా కేసు మళ్లీ విచారిస్తామని హైకోర్టు ఇటీవల స్పీకర్‌కు సూచించిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ షెడ్యూల్‌ను తేదీలవారిగా ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది.
ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment