Punjab Assembly Elections: Ex Cricketer Dinesh Mongia Joins BJP - Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన టీమిండియా వెటరన్.. కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!

Dec 28 2021 4:15 PM | Updated on Dec 28 2021 4:34 PM

Punjab Assembly Elections Ex Cricketer Dinesh Mongia Joins BJP - Sakshi

పంజాబ్‌ ఎన్నికలు ఆసక్తికర పరిణామాలకు దారితీస్తున్నాయి. టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌.. 

Ahead Of Punjab Election Ex Cricketer Joins BJP: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అక్కడి రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. కీలక నేతలతో పాటు ప్రముఖులను సైతం లాగేందుకు పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలకు గాలం వేస్తున్నాయి. 


తాజాగా టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ మోంగియా బీజేపీ కండువా కప్పుకున్నారు. భారత్‌ తరపున పరిమిత ఓవర్లలో ఆడిన మోంగియా.. ఆటకు దూరమైన 12 ఏళ్లకు 2019లో క్రికెట్‌ అన్ని ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పంజాబ్‌కు చెందిన ఈ మాజీ క్రికెటర్‌కు స్థానిక కోటాలో పార్టీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సీటు నిరాకరణతో బీజేపీలో చేరిపోయారు.

దినేశ్‌ మోంగియాతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఫతేహ్‌జంగ్‌ బజ్వా, బల్వీందర్‌ సింగ్‌, రానా గుర్మీత్‌ సోధి సైతం మంగళవారం మధ్యాహ్నం అధికారికంగా బీజేపీలో చేరారు. రానా గుర్మీత్‌ వారం క్రితమే కాంగగ్రెస్‌కు గుడ్‌బై ప్రకటించారు. ఇక ఫతేహ్‌.. తన అనుచరుడు బల్వీందర్‌తో ఇవాళ కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. 

ఇదిలా మాజీ ఆటగాళ్లు రాజకీయాల్లో చేరడం కొత్తేం కాదు కదా. నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ ఆల్రెడీ పంజాబ్‌ బరిలో ఉన్న విషయం తెలిసిందే.  తాజాగా  మరో వెటరన్‌ హర్భజన్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ పార్టీ లాగే ప్రయత్నం చేస్తోంది.  2019లో బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికైన గౌతం గంభీర్‌ను పంజాబ్‌ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది.

2017 ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకుగానూ కాంగ్రెస్‌ 77 సీట్లు దక్కించుకోగా, ఆమ్‌ఆద్మీ పార్టీ 20 సీట్లు, అకాలీదళ్‌ 15, బీజేపీ 3 స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: ఢిల్లీలో పంజాబ్‌ హీట్‌.. అమిత్‌షాతో అమరీందర్‌ సింగ్‌ భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement