Dinesh Mongia
-
బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్.. కాంగ్రెస్‌కు షాక్
Ahead Of Punjab Election Ex Cricketer Joins BJP: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అక్కడి రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. కీలక నేతలతో పాటు ప్రముఖులను సైతం లాగేందుకు పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలకు గాలం వేస్తున్నాయి. తాజాగా టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ మోంగియా బీజేపీ కండువా కప్పుకున్నారు. భారత్ తరపున పరిమిత ఓవర్లలో ఆడిన మోంగియా.. ఆటకు దూరమైన 12 ఏళ్లకు 2019లో క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పంజాబ్‌కు చెందిన ఈ మాజీ క్రికెటర్‌కు స్థానిక కోటాలో పార్టీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీటు నిరాకరణతో బీజేపీలో చేరిపోయారు. దినేశ్ మోంగియాతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఫతేహ్జంగ్ బజ్వా, బల్వీందర్ సింగ్, రానా గుర్మీత్ సోధి సైతం మంగళవారం మధ్యాహ్నం అధికారికంగా బీజేపీలో చేరారు. రానా గుర్మీత్ వారం క్రితమే కాంగగ్రెస్కు గుడ్‌బై ప్రకటించారు. ఇక ఫతేహ్.. తన అనుచరుడు బల్వీందర్‌తో ఇవాళ కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. Former Congress MLA Fateh Bajwa, Former MLA Akali Dal Gurtej Singh Gudhiyana, Former Member of Parliament United Akali Dal Rajdev Singh Khalsa, and Retired ADC and Advocate in Punjab Haryana High Court Madhumeet joins BJP today in Delhi pic.twitter.com/bJJEVnsSNQ — ANI (@ANI) December 28, 2021 ఇదిలా మాజీ ఆటగాళ్లు రాజకీయాల్లో చేరడం కొత్తేం కాదు కదా. నవజ్యోత్‌సింగ్ సిద్దూ ఆల్రెడీ పంజాబ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వెటరన్ హర్భజన్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ లాగే ప్రయత్నం చేస్తోంది. 2019లో బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికైన గౌతం గంభీర్‌ను పంజాబ్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2017 ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకుగానూ కాంగ్రెస్ 77 సీట్లు దక్కించుకోగా, ఆమ్ఆద్మీ పార్టీ 20 సీట్లు, అకాలీదళ్ 15, బీజేపీ 3 స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: ఢిల్లీలో పంజాబ్ హీట్.. అమిత్‌షాతో అమరీందర్ సింగ్ భేటీ -
12 ఏళ్ల తర్వాత క్రికెట్ గుడ్ బై
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ మోంగియా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దినేశ్ మోంగియా దూరమై సుమారు 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు.1995లో పంజాబ్ తరఫున అండర్-19 జట్టులో అరంగ్రేటం చేసిన దినేశ్ మోంగియా చివరగా 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో పంజాబ్ జట్టు తరఫున తన చివరి మ్యాచ్‌ని ఆడాడు. భారత్ తరఫున కూడా 2007లో తన ఆఖరి వన్డే ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో దినేశ్‌కు ఆఖరి వన్డే. ఇక ఏకైక అంతర్జాతీయ టీ20 మాత్రమే దినేశ్ ఆడాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించిన దినేశ్ మోంగియా ఆరేళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో రాణించి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచి భారత జట్టులో దినేశ్ సభ్యుడిగా ఉన్నాడు.2001లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ఆరంభించాడు. 2002లో గౌహతి వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 159 పరుగులతో సత్తా చాటాడు. భారత జట్టు తరఫున అతడు 57 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 27.95 యావరేజితో 1,230 పరుగులు చేశాడు. 14 వికెట్లు తీశాడు. ఇక, 121 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అతను 21 సెంచరీలు చేశాడు. భారత తరఫున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. లాంకషైర్, లైచెస్టర్‌షైర్ తరఫున అతను కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో ఆడటంతో బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. ఫలితంగా అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. గత సీజన్లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లో సెలక్టర్‌గా కూడా అతను బాధ్యతలు నిర్వర్తించాడు. -
నా గోడు వినండి: మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: ఐసీఎల్(ఇండియన్ క్రికెట్ లీగ్) నుంచి బయటికి వచ్చిన క్రికెటర్లు అందరికీ క్షమాభిక్ష అందించిన బీసీసీఐ,మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియాను మాత్రం పట్టించుకోవడం లేదు. బీసీసీఐతో ఎంతమాత్రం సంబంధం లేని ఆ క్రికెట్ లీగ్ వ్యవహారంలో మోంగియాపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా అతన్ని పక్కకు పెట్టేశారు. ఇక్కడ మోంగియాపై బీసీసీఐ ఎటువంటి నిషేధం విధించకపోయినప్పటికీ అతన్ని మాత్రం పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది. ప్రస్తుతం 40వ ఒడిలో ఉన్న మోంగియాకు తన క్రికెట్ పునరాగమనంపై ఎటువంటి ఆశలు లేవు. కాగా, తన గోడు వినాలంటూ బీసీసీఐకి మరోసారి మొరపెట్టుకున్నాడు. ప్రధానంగా తనకు చెల్లించాల్సిన ఉన్న బకాయిల విషయంలో బీసీసీఐకి ఇప్పటికే చాలాసార్లు విన్నవించానని, అందుకు వారి నుంచి ఎటువంచి సమాధానం రావడం లేదన్నాడు. తాజాగా మరోసారి తన గోడు వినే అవకాశాన్ని బీసీసీఐ కల్పించాలంటూ మోంగియా ఆవేదన వ్యక్తం చేశాడు. 'నాపై నిషేధం లేదు. కానీ బీసీసీఐ నా బకాయిల విషయంలో స్పందించడం లేదు. ఇది చాలా కొత్తగా ఉంది. చాలాసార్లు బీసీసీఐకి, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కి నా వాదన వినాలని లేఖ రాశా. అయినా వారు ముందుకు రావడం లేదు. ఐసీఎల్ లో నేను తప్పుచేశాను అనడానికి సాక్ష్యాలు లేవు. కనీసం నా వాదనను వినే అవకాశం ఇవ్వండి. ఇటీవల మొహ్మద్ అజహరుద్దీన్ కేసును విన్నట్లే, నా వాదన కూడా వినండి. బీసీసీఐ క్షమాబిక్ష కోసం ఎదురుచూస్తున్నా'అని మోంగియా విన్నవించాడు. ఐసీఎల్ ఫిక్సింగ్ వివాదంపై 2015లో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ .. మోంగియా పేరును బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించిన నలుగురు సభ్యుల బృందానికి దినేశ్ మోంగియా నాయకత్వం వహించాడని అతను వెల్లడించాడు. కాగా, అతను తప్పుచేసినట్లు ఆధారాలు లభించలేదు.మరొకవైపు బీసీసీఐ కూడా మోంగియా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన జట్టులో సభ్యుడైన దినేశ్ మోంగియా భారత్ తరఫున 57 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు. -
దినేశ్ మోంగియానే గ్యాంగ్‌లీడర్!
ఐసీఎల్ ఫిక్సింగ్పై విన్సెంట్ సాక్ష్యం ఖండించిన మోంగియా లండన్: ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఫిక్సింగ్ వివాదంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ మరో కొత్త అంశాన్ని తెర మీదికి తెచ్చాడు. ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించిన నలుగురు సభ్యుల బృందానికి భారత మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా నాయకత్వం వహించాడని అతను వెల్లడించాడు. మోంగియా సూచనలతోనే చండీగఢ్ లయన్స్ జట్టు సభ్యులు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని విన్సెంట్ గుట్టు విప్పాడు. తనతో పాటు ఇతర కివీస్ క్రికెటర్లు క్రిస్ కెయిన్స్, డరైల్ టఫీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని అతను కోర్టులో చెప్పాడు. క్రిస్ కెయిన్స్ ‘మోసపూరిత’ కేసుకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న విచారణకు హాజరైన విన్సెంట్... నాటి సంగతులు బయట పెట్టాడు. ఒక్కో మ్యాచ్‌కు తనకు 50 వేల డాలర్లు ఇస్తానని కెయిన్స్ చెప్పినట్లు విన్సెంట్ కుండబద్దలు కొట్టాడు. అయితే ఈ తాజా ఆరోపణలను మోంగియా ఖండించాడు. ‘నేను చండీగఢ్ తరఫున ఆడిన మాట వాస్తవమే. కానీ ముగ్గురు కివీస్ క్రికెటర్లు కలిసి ఏం చేశారనేది నాకు తెలీదు’ అని అతను వివరణ ఇచ్చాడు. 2008లోనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పి మోంగియాపై ఐసీఎల్ నిర్వాహకులు నిషేధం విధించినా... సరైన కారణాలు బయట పెట్టలేదు. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన జట్టులో సభ్యుడైన దినేశ్ మోంగియా భారత్ తరఫున 57 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు. ఐసీఎల్ నుంచి బయటికి వచ్చిన క్రికెటర్లు అందరికీ క్షమాభిక్ష అందించిన బీసీసీఐ, మోంగియాను మాత్రం పట్టించుకోలేదు.