Rahul Narvekar
-
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నర్వేకర్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. నర్వేకర్ ఆదివారం సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, అజిత్‌లతో కలిసి అసెంబ్లీ కార్యదర్శి జితేంద్ర భోలెకు నామినేషన్ పత్రాలను అందజేశారు. స్పీకర్ పదవికి పోటీ పడరాదన్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నిర్ణయంతో నర్వేకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం స్పీకర్ ఎన్నికపై నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శాసనసభ, శాసనమండలి సభ్యులతో జరిగే ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తారు. అదేవిధంగా, ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని తమ కూటమిలోని పార్టీలకు వదిలేయాలని ఎంవీఏ నేతలు ఆదివారం సీఎం ఫడ్నవీస్‌ను కలిసి కోరారు. ప్రతిపక్ష నేత పదవిని కూడా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 288 సీట్లకుగాను మహాయుతి 230 స్థానాలను గెల్చుకోవడం తెల్సిందే. ముంబైలోని కొలాబా నుంచి మళ్లీ ఎన్నికైన రాహుల్ నర్వేకర్ గత 14వ అసెంబ్లీ స్పీకర్‌గా రెండున్నరేళ్లపాటు కొనసాగారు. ఆ సమయంలో శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాల వ్యవహారంపై మహాయుతి ప్రభుత్వానికి అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు!మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. అతిత్వరలో విస్తరణ ఉంటుందని మహాయుతి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో కీలక భగస్వామి అయిన శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. కీలక శాఖలు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. శివసేన(షిండే) నుంచి మంత్రులుగా ప్రమాణం చేసేవారిలో ఆరుగురు మాజీ మంత్రులే ఉంటారని సమాచారం. కొత్తగా ఐదుగురికి మంత్రి యోగం పట్టబోతున్నట్లు తెలుస్తోంది. కనీసం 13 మంత్రి పదవులు కావాలని శివసేన(షిండే) డిమాండ్ చేయగా 11 పదవులకు బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. -
శరద్ పవార్‌కు మరో షాక్.. ‘అజిత్‌దే నిజమైన ఎన్సీపీ’: మహారాష్ట్ర స్పీకర్
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వివాదంలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వెంటే ఉన్నారని.. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్ వర్గం ఎన్సీపీనే నిజమైన పార్టీ. అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్‌కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉన్నందున ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేము’ అని తెలిపారు. చదవండి: టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా కాగా శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి 2023 జూలైలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఇరు నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ముఖ్యంగా పార్టీ ఎవరిది, ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారనే రెండు అంశాలపై రెండు వర్గాల మధ్య చిచ్చు నెలకొంది. అయితే ఇటీవల అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాన్ని 'అసలైన రాజకీయ పార్టీ'గా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పార్టీ పేరు, గడియారం గుర్తు అజిత్‌కే దక్కింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని వర్గానికి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్' అనే కొత్త పేరు వచ్చింది. -
మహారాష్ట్ర స్పీకర్‌కు బాంబే హైకోర్టు నోటీసులు
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత, చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్, 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికీ కోర్టు నోటీసులిచి్చంది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమరి్పంచాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో 8కి వాయిదావేసింది. -
జనవరి 10 కల్లా తేల్చండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శివసేన పార్టీలోని రెండు వర్గాలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పెట్టుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువు పెంచింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చాలంటూ ఇచ్చిన గడువును తాజాగా మరో 10 రోజులు పొడిగించింది. ‘డిసెంబర్ 20వ తేదీతో అసెంబ్లీ కార్యకలాపాలు ముగుస్తున్నందున, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువు పొడిగించాలంటూ స్పీకర్ పెట్టుకున్న వినతిని సహేతుకమైందిగా భావిస్తున్నాం. అందుకే, గడువును మరో 10 రోజులపాటు, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. -
‘మహా’ స్పీకర్‌గా నర్వేకర్.. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు!
ముంబై: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభాపతి ఎన్నిక నిర్వహించారు. నూతన స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్(45) ఎన్నికయ్యారు. ఆయనకు 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా అత్యంత పిన్నవయస్కుడైన అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ రికార్డుకెక్కారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. రాహుల్ మామ, ఎన్సీపీ నేత రామ్‌రాజే నాయక్ మహారాష్ట్ర శాసనమండలి చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. కొత్త స్పీకర్ వెంటనే రంగంలోకి దిగారు. శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని తొలగించారు. ఆ స్థానంలో సీఎం షిండేను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తిరుగుబాటుకు ముందు షిండేనే ఎల్పీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. శివసేన సభ్యుడు రమేశ్ లాట్కే మరణంతో ఖాళీ ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్, ఎన్సీపీ నేత నరహరి జిర్వాల్ ఓటు వేయలేదు. కొందరు శివసేన ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి, ప్రత్యర్థికి ఓటు వేశారని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నరహరి జిర్వాల్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 287 మంది ఎమ్మెల్యేలకు గాను 271 మంది ఓటు వేశారు. వివిధ కారణాలతో పలువురు గైర్హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా స్పీకర్ ఎన్నిక జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ ఒక ప్రకటనలో ప్రశంసించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పటిష్టమైన భద్రత మధ్య సమీపంలోని హోటల్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. మహారాష్ట్ర నూతన సర్కారు బలపరీక్ష సోమవారం అసెంబ్లీలో జరుగనుంది. శివసేన ఎమ్మెల్యేలకు రెండు విప్‌లు శివసేన రెండు వర్గాలు విడిపోయింది. స్పీకర్ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్ జారీ చేశాయి. షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్‌గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. పార్టీ విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్ ప్రభు చెప్పారు. తమ వర్గంలో లేని 16 మందికి కూడా విప్ జారీ చేశామని షిండే వర్గం ఎమ్మెల్యే దీపక్ చెప్పారు. సేన శాసనసభాపక్ష కార్యాలయానికి సీల్ విధాన భవన్లో శివసేన శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గంఆదివారం మూసివేసింది. తలుపులు బిగించి, తెల్లకాగితం అతికించి, దానిపై టేప్ వేశారు. శివసేన శాసనసభా పక్షం ఆదేశాల మేరకు ఆఫీసును మూసివేస్తున్నట్లు రాశారు. కసబ్‌కు కూడా ఇంత సెక్యూరిటీ లేదు: ఆదిత్య రెబల్ ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం పట్ల శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాది కసబ్‌కు కూడా ఇంత సెక్యూరిటీ లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితి ముంబైలో ఎప్పుడూ చూడలేదన్నారు. ‘‘ప్రభుత్వానికి భయమెందుకు? ఎవరైనా జారుకుంటారని భయపడుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. -
‘మావల్’ బరి చీలిక ఓట్లవైపే ‘శేత్కారీ’ చూపు
పింప్రి, న్యూస్‌లైన్: ప్రస్తుత ఎన్నికల్లో మావల్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్-ఎన్సీపీ ఉమ్మడి అభ్యర్థిగా రాహుల్ నార్వేకర్ పోటీ చేస్తుండగా, శేత్కారీ కామ్‌గార్ పార్టీకి చెందిన చించ్వాడ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగతాప్ ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. లక్ష్మణ్‌కు స్వాభిమాన్ రిపబ్లికన్, ఎమ్మెన్నెస్ పార్టీలు అండగా నిలిచాయి. ఈ నియోజకవర్గంలో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎన్సీపీ.... లక్ష్మణ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు యత్నిస్తోంది. పింప్రి, చించ్వాడ్ పన్వేల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్‌పవార్ ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్-ఎన్సీపీ ఓట్ల చీలికను నిరోధించేందుకు శరద్‌పవార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన అజామ్ పాన్సారే ఆ పార్టీకి వీడ్కోలు పలకడం, ఎన్సీపీకి మద్దతుగా నిలిచిన లక్ష్మణ్ జగతాప్ కూడా దూరం కావడం అధిష్టానానికి ఇబ్బందికరంగా పరిణమించింది. అయితే పాన్సారే కాంగ్రెస్‌లో చేరడం ఒకింత మేలైనప్పటికీ ప్రస్తుతం ఎన్సీపీ అభ్యర్థికి ఏమేరకు సహకరిస్తాడనేది వేచిచూడాల్సిందే. ఎన్సీపీ-కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే కాషాయ కూటమి ఇక్కడ విచిత్రపరిస్థితిని ఎదుర్కొంటోంది. శివసేన-బీజేపీ పొత్తు లో భాగంగా శివసేన అభ్యర్థిగా శ్రీరంగ భరణీ పోటీ చేస్తున్నారు. భరణికి ప్రస్తుతం మావల్, కర్జత్ బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ఎమ్మెన్నెస్. కాషాయ కూటమి ఓట్లను చీల్చేందుకు లక్ష్మణ్ జగతాప్‌కు మద్దతు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మావల్లో బీజేపీ పటిష్టానికి గత 20 సంవత్సరాలుగా రూపరేఖా డోరే, దిగంబర్ బేగడే, సంజయ్ భేగడే తదితర నాయకులు నిరంతరం శ్రమిస్తున్నారు. గతంలో మావల్ నుంచి బరిలోకి దిగి న శివసేన అభ్యర్థి గజానన్ బాబర్‌కు మెజారిటీ ఓట్లు లభిం చాయి. ఇక శ్రీరంగభరణి బీజేపీ, శివసేన కార్యకర్తలను సమన్వయ పరుస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇతడు కూడా కాషాయ కూటమిలో ఓట్ల చీలికను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పోటీ త్రిముఖంగా కనిపిస్తుంది. ఓట్ల చీలిక ద్వారా లబ్ధి పొందాలని లక్ష్మణ్ ఆశిస్తుండగా, అసమ్మతి ఓట్లను రాబట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మారుతి బాప్కర్ కూడా పార్టీల్లో వచ్చే చీలిక ఓట్లపైనే ఆధారపడి ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం బరిలోకి దిగిన బీఎస్సీ అభ్యర్థి టెక్సెస్ గైక్వాడ్ దళిత ముద్రతో ముందుకు సాగుతున్నారు. మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన రాందాస్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ శివసేనకు మద్దతుగా ప్రచారం చేస్తోంది. అటు కాషాయకూటమి బరిలో ఉండడం, ఇటు దళిత ఓట్లు,ఎన్సీపీ ఓట్ల చీలికపైనే ఆధారపడిన లక్ష్మణ్ ఏమేరకు విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే. ఈ నియోజకవర్గంలో పింప్రి, చించ్వాడ్, మావల్‌లోని దేహురోడ్ తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు వేలసంఖ్యలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలుగువారి అభిప్రాయాలను ‘న్యూస్‌లైన్’ సేకరించింది. -
ఎన్సీపీలో చేరిన శివసేన అధికార ప్రతినిధి
ముంబై: ఇంతకాలం శివసేన కీలక సభ్యుడిగా ఉన్నరాహుల్ నార్వేకర్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇటీవల రాష్ట్ర విధాన మండలి ఎన్నికలకు వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నశివసేన అధికార ప్రతినిథి రాహుల్ నార్వేకర్ సోమవారం ఎన్సీపీలో చేరారు. సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మావల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నార్వేకర్ పోటీచేస్తారని ఆ పార్టీ పేర్కొంది.