మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఈసీ నోటీసులు | EC Notice Given To Rahul Gandhi Over PM Modi | Sakshi
Sakshi News home page

మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఈసీ నోటీసులు

Published Thu, Nov 23 2023 5:23 PM | Last Updated on Thu, Nov 23 2023 6:05 PM

EC Notice Given To Rahul Gandhi Over PM Modi - Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. రాహుల్‌ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. 

వివరాల ప్రకారం.. రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు ఇచ్చింది. క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమి నేపథ్యంలో మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఫైనల్‌ సందర్బంగా మోదీ స్టేడియంకు వెళ్లడం వల్లే టీమిండియా ఓడిపోయిందని రాహుల్‌ అన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీని అపశకునంగా రాహుల్‌ పోల్చారు. ఈ క్రమంలో మోదీని పనౌతీ, పిక్‌ పాకెటర్‌ అంటూ రాహుల్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో, రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం, ఈసీ.. రాహుల్‌కు నోటీసులు పంపింది. రాహుల్‌ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement