సాక్షి, కామారెడ్డి: టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై సిట్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు ఆయన దగ్గరున్న వివరాలు ఇవ్వాలని సిట్.. సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు పంపించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు చేరుకున్నారు. రేవంత్ ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. నోటీసుల్లో భాగంగా ఈనెల 23వ తేదీన సిట్ ఆఫీసు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరారు.
అయితే, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ యాత్రలో ఉన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. టీఎస్‌టీఎస్ ఛైర్మన్ కేటీఆర్‌కు దగ్గరి బంధువు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను టీఎస్‌టీఎస్ మాత్రమే నిర్వహిస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ఐటీ శాఖకు ఏం సంబంధమని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్‌పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగింది. కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలి. పేపర్ లీకేజీ స్కాంను తామే బయటపెట్టామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక విషయంలో కేటీఆర్ నిజం మాట్లాడారు. ఈ స్కాంలో ఇద్దరికే సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారు. ఆ ఇద్దరు కేసీఆర్, కేటీఆరేనని నేను అంటున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ నోటీసులు ఊహించిందే. నన్ను వేధించాలనే నోటీసులు ఇస్తోంది. సిట్ నోటీసులను స్వాగతిస్తున్నాను. కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇవ్వాలి. కేటీఆర్‌తో పాటు సబిత, శ్రీనివాస్ గౌడ్, సిట్ అధికారి శ్రీనివాస్‌కు కూడా నోటీసులు ఇవ్వాలి. నా దగ్గర ఉన్న ఆధారాలు సిట్‌ను ఇస్తాను. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వకపోతే కోర్టులో తేల్చుకుంటాను అని అన్నారు.
ఇక, పేవర్ లీక్ వ్యవహారంపై అంతకుముందు రేవంత్ మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్ష పత్రం లీకేజీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో కరీంనగర్‌లోని మల్యాల మండలంలో వంద మందికి పైగా అభ్యర్థులు ప్రిలిమ్స్ క్లియర్ చేశారని ఆరోపించారు. ప్రిలిమ్స్‌లో వీరికి 100కుపైగా మార్కులు వచ్చాయన్నారు. ఇందులో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే సిట్ తమకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపించింది.
ఇది కూడా చదవండి: కేటీఆర్ పీఏపై రేవంత్ షాకింగ్ కామెంట్స్..
Comments
Please login to add a commentAdd a comment