
సాక్షి,హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణలపై సిట్ స్పందించింది. డేటా ఎవరికీ ఇవ్వలేదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వంద మందిని విచారించాం. రూ.4 లక్షల నగదు సీజ్ చేశామని తెలిపారు. కాగా, పేపర్ల లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఛైర్మన్‌నూ కూడా సిట్ విచారించనుంది. ఇంటి దొంగల పాత్రపై సిట్ ఫోకస్ పెట్టింది.
పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు.
చదవండి: కేటీఆర్ ఏమైనా రకుల్ సినిమాకు సైన్ చేసినట్టా..! రేవంత్ రెడ్డి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment