సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో, ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్.. దూకుడు పెంచింది. ఆరోపణలు చేసిన పొలిటికల్ లీడర్లకు నోటీసులు అందజేస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలను అందించాలంటూ సిట్ వారిని కోరింది. దీంతో, పేపర్ లీక్ అంశం ఆసక్తికరంగా మారింది.
పేపర్ లీక్ విషయంలో ఆరోపణలు చేస్తున్న పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చి.. వారి వద్ద ఆధారాలని పేర్కొంది. ఇక, పేపర్ లీక్ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిట్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని సిట్ ఏసీపీ కోరారు. ఇక, రేవంత్ ఇటీవలే పేపర్ లీక్ అంశంలో కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ఇవ్వాలని సిట్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్, రాజశేఖర్‌కు బెదిరింపులు: రేవంత్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment