న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో జరిగిన ఏవియేషన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది. జూన్ 6వ తేదీన ఉదయం దర్యాప్తు సంస్థ అధికారి ముందు హాజరుకావాలని ఆయనకు నోటీసు ఇచ్చింది. విమానయాన మంత్రిగా తన హయాంలో వివిధ ఏవియేషన్ సంస్థలకు లాభం చేకూర్చే క్రమంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు నష్టపోయిందని ఈడీ ఆరోపిస్తోంది. అరెస్ట్‌అయిన లాబీయిస్ట్ దీపక్ తల్వార్ విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం, లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారాయని ఇది మనీలాండరింగ్ కేసుగా భావిస్తున్నామని ఈడీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment