Updates..
► మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్ సభ మరోసారి దద్దరిల్లింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
► మణిపూర్ అంశంపై తప్పుకుండా చర్చిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. లోక్‌సభలో మణిపూర్ అంశంపై చర్చను జరగనీయాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ సున్నితమైన అంశానికి సంబంధించిన వివరాలను దేశ ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా చెప్పారు.
► మణిపూర్ అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వెల్‌లోకి దూసి ఆయనపైకి ఫ్లకార్డ్‌లతో నిరసనలు తెలిపారు. విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
#WATCH | Rajya Sabha Chairman suspends AAP MP Sanjay Singh for the remaining duration of the Monsoon session during the Opposition's protest in the House over the Manipur issue pic.twitter.com/YpNYIhhMck
— ANI (@ANI) July 24, 2023
► ఈ క్రమంలో ధన్కర్.. సంజయ్ సింగ్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు. వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ధన్కర్ స్పష్టం చేశారు.
► మళ్లీ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో రెండు సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
► లోక్‌సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది.
► మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ వాయిదా.
#MonsoonSessionofParliament | Rajya Sabha adjourned till 12 noon.
— ANI (@ANI) July 24, 2023
► లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీల నిరసనలు..
Opposition MPs with placards 'INDIA for Manipur' and 'INDIA demand PM statement on Manipur' in Lok Sabha as the session gets underway pic.twitter.com/uHcmyheJDI
— ANI (@ANI) July 24, 2023
► లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మణిపూర్‌కు చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు.
"We are ready for discussion in Parliament," says Defence Minister Rajnath Singh in Lok Sabha as
— ANI (@ANI) July 24, 2023
opposition MPs demand PM Modi's statement on Manipur#MonsoonSession pic.twitter.com/36t74wKlBL
► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 140 కోట్ల మంది ప్రజల నాయకుడు(ప్రధాని మోదీ) పార్లమెంటు వెలుపల ప్రకటన చేశారు. అలాగే, ప్రజాప్రతినిధులు కూర్చునే పార్లమెంటులో కూడా ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు.
#WATCH | "We are ready...If the leader of 140 crore people makes a statement outside the Parliament, then he should make a statement in the Parliament where people's representatives sit," says LoP Rajya Sabha & Congress President Malliakarjun Kharge. pic.twitter.com/QtT5JiNYAO
— ANI (@ANI) July 24, 2023
► టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. మణిపూర్ దారుణ ఘటనలో సోషల్ మీడియాలో మేము చూసిన విజువల్స్ చాలా కలవరపెడుతున్నాయి. మణిపూర్‌పై సభలో చర్చను ప్రధాని మోదీ కోరుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిని మళ్లిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అసమర్థమైనది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
► ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ ఘటన మహిళలకు సంబంధించిన విషయం. ఇదేమీ రాష్ట్రాల మధ్య పోటీ కాదు. ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలో జరిగినా అది తప్పే అవుతుందన్నారు.
#WATCH | NCP MP (Sharad Pawar faction) Supriya Sule on Manipur viral video, says, "This is about women, not a competition between States. Such a thing happening in any state is wrong." pic.twitter.com/YCdnaF40VR
— ANI (@ANI) July 24, 2023
► పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.
#WATCH | Congress Parliamentary Party Chairperson and Lok Sabha MP Sonia Gandhi arrives at the Parliament.
— ANI (@ANI) July 24, 2023
#MonsoonSession pic.twitter.com/PPzBrtXlA9
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మరోసారి మణిపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు మణిపూర్‌పై ప్రధాని మోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.
► ఇటు, అధికార బీజేపీ పార్లమెంట్ సభ్యులు.. పలు రాష్ట్రాలకు మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు.
#WATCH | Opposition parties (I.N.D.I.A) protest in Parliament demanding PM Modi's statement on Manipur in both houses. pic.twitter.com/b8kjFA7UUB
— ANI (@ANI) July 24, 2023
► రాజస్థాన్‌కు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. వీరంతా రాజస్థాన్‌లో జరుగుతున్న క్రైమ్స్, మహిళలపై దాడులను ఖండిస్తూ నిరసనలు తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Delhi: BJP Rajasthan MPs along with senior leaders hold a protest in front of the Gandhi statue. The protest is against issues of rising atrocities and crime against women in the state. pic.twitter.com/ruyKBbsZEM
— ANI (@ANI) July 24, 2023
► ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభల్లో మాట్లాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. మణిపూర్ శాంతి నెలకోల్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. మణిపూర్ విషయంలో కేంద్రం తీరుకు మేము ఈరోజు నిరసనలు తెలుపుతాము. రాజ్యసభ ఛైర్మన్ చర్చకు అనుమతించాలని కోరారు.
#WATCH | AAP MP Raghav Chada says "The country demands that the Govt and PM Modi should speak on the issue of Manipur. It is the responsibility of the Central govt to restore peace in the country. Today we are going to protest against this issue in the Parliament. Rajya Sabha… pic.twitter.com/bHGAVZMqOF
— ANI (@ANI) July 24, 2023
► ‘ఇండియా’.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసనకు దిగారు. మణిపూర్ అంశంపై ఉభయ సభల్లో ప్రధాని చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
#WATCH | Opposition parties (I.N.D.I.A) protest in Parliament demanding PM Modi's statement on Manipur in both houses. pic.twitter.com/zhX9ZKMtal
— ANI (@ANI) July 24, 2023
► కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నాం. చర్చల నుంచి ఎందుకు పారిపోతున్నారు? వారి వ్యూహాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు అని అన్నారు.
#WATCH | We request the Opposition to take part in structured and constructive discussions in the Parliament. Why are they running away from discussions? Nobody is able to understand their strategy: Union minister Pralhad Joshi on Manipur issue pic.twitter.com/CQrNoMZP3W
— ANI (@ANI) July 24, 2023
#WATCH | Delhi: On BJP's protest against rising atrocities & crime against women in Rajasthan, BJP MP Ravi Kishan says, "We demand the resignation of Rajasthan CM Ashok Gehlot. The atrocities on Dalits (women) need to be stopped. The atrocities have tremendously increased and so… pic.twitter.com/bLrZPf6ADf
— ANI (@ANI) July 24, 2023
Comments
Please login to add a commentAdd a comment