ఐక్యమత్యమే మహాబలం అని చిన్నప్పుడు కథలు కథలుగా చదువుకున్నాం. కానీ దానికి ఉన్న పవర్ ఏంటో ఈ ప్రకృతిలోని కొన్ని జీవాలు మనుషులకు చెప్పకనే చెబుతున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియోను పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..గొంగళి పురుగులు గుంపులు గుంపులుగా స్పీడ్‌గా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తుంది.
సాధారణంగా గొంగళిపురుగులు చాలా నిదానంగా వెళ్తాయి. అవి విడిగా..ఒక్కొక్కటి అంత తొందరగా భూమ్మీద పాకవు. అలాంటిది అవి ఒక దానిపై ఒకటి గుంపుగా స్పీడ్‌గా పాకుతూ వెళ్తున్నాయి. ఐక్యతగా ఉంటే ఏ పనైనా సులభంగా చేయోచ్చు అని చెబుతుంది. ఐక్యతకు ఉన్న శక్తిని కూడా తెలియజేసింది. "ఆ గొంగళి పురుగులు విడిగా కంటే సముహంగా ఉంటే వేగంగ వెళ్లగలవు, ఇదే ఐక్యత బలం అంటూ ట్వీట్ చేశారు హర్ష గోయెంకా. దీనికి నెటిజన్లు ఎంతో మంచి విషయాన్ని గుర్తు \ చేశారంటూ ధన్యవాదాలు చెప్పారు. అంతేగాదు కలిసి ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలమని, టీమ్‌గా ఉంటే ఎన్నో అద్భుతాలు చేయగలం అంటూ మరికొందరూ నెటిజన్లు ట్వీట్ చేశారు.
It’s a group of caterpillars, moving in a formation known as a rolling swarm. This rolling swarm of caterpillars moves faster than any single caterpillar. Power of unity…pic.twitter.com/TibW70GP9n
— Harsh Goenka (@hvgoenka) February 24, 2023
(చదవండి: వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్‌లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!)
Comments
Please login to add a commentAdd a comment