మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా! | Harsh Goenka Shares Special Food Service At Maharaja Of Gwaliors Palace | Sakshi
Sakshi News home page

మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!

Published Mon, Apr 1 2024 1:58 PM | Last Updated on Mon, Apr 1 2024 6:37 PM

Harsh Goenka Shares Special Food Service At Maharaja Of Gwaliors Palace - Sakshi

హోటల్స్‌, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్‌ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్‌ సర్వింగ్‌ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్‌ హోటల్స్‌లో సర్వింగ్‌ విధానమే ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ అధినేత హర్ష్‌ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. 

ఆ వీడియోలో గాల్వియర్‌ మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్‌ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా వెరైటీగా ఉంది. ఓ పెద్ద టేబుల్‌పై ట్రైయిన్‌ టాయ్‌లా ఉండే పట్టాల మధ్యలో వివిధరకాల పదార్థాల పాత్రాలను చక్కగా ఉంచారు. మరోవైపు ఆ పట్టాలపై నడుస్తున్న ట్రైయిన్‌ టాయ్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

ఆ ట్రైయిన్‌ బోగిలపై గాల్వియర్‌ మహారాజ్‌ సింథియా పేరుకి సంబంధించినఅక్షరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ట్రైయిన్‌ టాయ్‌  పట్టాల మధ్య ఉన్న ఒక్కో ఆహార పదార్థం వద్దకు చకచక వస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోకి "మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహారం ఎలా వడ్డిస్తారు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట షేర్‌ చేశారు హర్ష్‌ గోయెంకా. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: డబ్బావాలా మాదిరి టిఫిన్‌ సెంటర్‌తో.. ఏకంగా 21 కోట్లు..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement