serving
-
మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!
హోటల్స్, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్ సర్వింగ్ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్ హోటల్స్‌లో సర్వింగ్ విధానమే ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియోలో గాల్వియర్ మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా వెరైటీగా ఉంది. ఓ పెద్ద టేబుల్‌పై ట్రైయిన్ టాయ్‌లా ఉండే పట్టాల మధ్యలో వివిధరకాల పదార్థాల పాత్రాలను చక్కగా ఉంచారు. మరోవైపు ఆ పట్టాలపై నడుస్తున్న ట్రైయిన్ టాయ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.ఆ ట్రైయిన్ బోగిలపై గాల్వియర్ మహారాజ్ సింథియా పేరుకి సంబంధించినఅక్షరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ట్రైయిన్ టాయ్ పట్టాల మధ్య ఉన్న ఒక్కో ఆహార పదార్థం వద్దకు చకచక వస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోకి "మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం ఎలా వడ్డిస్తారు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. మీరు కూడా ఓ లుక్కేయండి.How food is served at Maharaja of Gwalior’s palace! pic.twitter.com/AGaYkj6PyG— Harsh Goenka (@hvgoenka) March 31, 2024 -
మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!
హోటల్స్, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్ సర్వింగ్ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్ హోటల్స్‌లో సర్వింగ్ విధానమే ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియోలో గాల్వియర్ మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా వెరైటీగా ఉంది. ఓ పెద్ద టేబుల్‌పై ట్రైయిన్ టాయ్‌లా ఉండే పట్టాల మధ్యలో వివిధరకాల పదార్థాల పాత్రాలను చక్కగా ఉంచారు. మరోవైపు ఆ పట్టాలపై నడుస్తున్న ట్రైయిన్ టాయ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆ ట్రైయిన్ బోగిలపై గాల్వియర్ మహారాజ్ సింథియా పేరుకి సంబంధించినఅక్షరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ట్రైయిన్ టాయ్ పట్టాల మధ్య ఉన్న ఒక్కో ఆహార పదార్థం వద్దకు చకచక వస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోకి "మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం ఎలా వడ్డిస్తారు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. మీరు కూడా ఓ లుక్కేయండి. How food is served at Maharaja of Gwalior’s palace! pic.twitter.com/AGaYkj6PyG — Harsh Goenka (@hvgoenka) March 31, 2024 (చదవండి: డబ్బావాలా మాదిరి టిఫిన్ సెంటర్‌తో.. ఏకంగా 21 కోట్లు..!) -
కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్న మనసున్న అమ్మ
ప్రేమను పంచడంలో అమ్మ తర్వాతే ఎవరైనా! కొంతమంది తల్లులు తమ పిల్లల్లాగే... ఇతరులను సైతం ప్రేమగా చూసుకుంటుంటారు. కడుపున జన్మించక పోయినప్పటికీ ఆ తల్లి చూపే ప్రేమాభిమానాలకు అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే బిందు రమాకాంత్ ఘట్ పాండే. బిందుని తన పిల్లలేగాక, వేలాదిమంది ‘అమ్మ’ అని అప్యాయంగా పిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెడుతూ ఎందరికో అమ్మగా మారింది బిందు రమాకాంత్ ఘట్పాండే. అంతమందికి అమ్మగా మారిన బిందు గురించి ఆమె మాటల్లోనే.... ‘‘రాజస్థాన్‌లోని ఝుంఝునులో పుట్టాను. ముగ్గురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు ఉన్న పెద్ద కుటుంబం మాది. నాన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ప్రతి రెండేళ్లకోసారి నాన్నకు బదిలీలు జరిగేవి. దీంతో చాలా భాషలు పరిచయం అయ్యాయి. పంజాబీ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలు చక్కగా మాట్లాడగలను. నా పెళ్లి అయిన తరువాత మా ఆయనతో కలిసి భోపాల్‌లో స్థిరపడ్డాను. నాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి కోల్‌కతా ఐఐఎమ్ టాపర్. అమ్మాయి దుబాయ్‌లో రేడియో జాకీ. యాంకర్‌గా పనిచేస్తోంది. పిల్లల బాధ్యతలు తీరాక నాకు చాలా ఖాళీ సమయం దొరికింది. ఈ సమయంలో సమాజానికి ఏదైనా మంచి చేయాలనిపించింది. ఏం చేయాలా... అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు టీవీలో ‘గ్రాండ్ మదర్స్ కిచెన్’ గురించి చూశాను. అప్పుడే నాకు కూడా ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. మా ఆయనకు చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. వెంటనే ఇంట్లో భోజనం తయారు చేసి కారులో పెట్టుకుని రోడ్డుమీదకు ఆకలితో ఉన్న వారు కనిపిస్తే వారికి భోజనం పార్శిల్ ఇచ్చేదాన్ని. వాళ్లు తిన్న తరవాత చెప్పే కృతజ్ఞతలతో నాకు కడుపు నిండిపోయేది. అలాగే ఉదయాన్నే పాతిక లీటర్ల గంజి తయారు చేసి వీధికుక్కలకు పోసేదాన్ని. ఆ తరువాత ‘ఉత్కర్షిణి’ పేరిట కిచెన్‌ను ఏర్పాటు చేశాను. ప్రస్తుతం ఈ ఉత్కర్షిణి వందలాది మంది ఆకలి తీరుస్తోంది. రోజుకో మెను... కిచెన్‌లో ఎంతో పరిశుభ్రంగా భోజనం వండిస్తాను. తయారీ అంతా నా పర్యవేక్షణలో జరుగుతుంది. రోజుకొక మెను పెడుతున్నాను. ఒక రోజు పప్పు, కూరలు, అన్నం పెడితే.. మరుసటిరోజు రాజ్మా, అన్నం, ఇంకోరోజు పూరీ, కూరలతో వడ్డిస్తున్నాం. పప్పు, అన్నం అయితే ప్లేటు ఐదు రూపాయలకు, రసగుల్లా, హల్వా పూరీ ఉన్న రోజు ప్లేటు ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నాం. మా భోజనం తినేవారి సంఖ్య పెరగడం... ‘‘భోజనం బావుంది, కానీ స్వీట్ ఉంటే బావుంటుంది’’ అని కస్టమర్లు చెప్పడంతో తొలుత హల్వా పెట్టడం మొదలుపెట్టాము. ఇప్పుడు రసగుల్లా కూడా పెడుతున్నాం. ఆకలి తిరడానికి మాత్రమే... ఉత్కర్షిణి కిచెన్‌లో తయారైన భోజనానికి ఎలాంటి నిబంధనలు లేవు. నిరుపేదల నుంచి ఎవరైనా తినవచ్చు. మా భోజనం తినేవారిలో పారిశుధ్య కార్మికులు, రిక్షా నడిపేవాళ్లు, నర్సులు, డాక్టర్లు, విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎవరికి ఆకలి వేసినా తిని వెళ్లాల్సిందే తప్ప.. ఇంటికి ప్యాక్ చేసి ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులు మందులు వేసుకునే ముందు ఏదైనా తినాలని చెప్పి సమోసా, బిస్కెట్లు తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే వీరు సైతం తినేలా మా కిచెన్ ఆహార పదార్థాలు అందిస్తోంది. అలా వందలమందికి.. నేను పెడుతోన్న భోజనానికి డిమాండ్ పెరగడంతో వంటవాళ్లను పెట్టుకుని వండించడం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఆసుపత్రి, దానిపక్కన స్టూడెంట్ క్యాంపస్ ఉంది. అక్కడ భోజనం ప్లేటు ఐదు రూపాయలకు ఇస్తున్నాను. చాలామంది విద్యార్థులు వచ్చి తింటున్నారు. అలా నా దగ్గర భోజనం చేయడానికి వచ్చేవారు నన్ను ‘‘అమ్మ లేదా మా’’ అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా ఉత్కర్షిణి కిచెన్ కుటుంబం రోజురోజుకి పెరిగిపోతోంది. అందుకే త్వరలో భోపాల్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా నా సేవలను విస్తరించబోతున్నాను. మరింత మంది ఆకలి తీర్చడమే నా లక్ష్యం’’అని చెప్పింది బిందు రమాకాంత్ ఘట్పాండే. -
నీతా అంబానీ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ నవంబర్ 1న తన 60వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో 3000 మంది పిల్లల మధ్య నీతా అంబానీ ఈ వేడుకను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 1.4 లక్షల మందికి ‘అన్నసేవ’ ద్వారా అన్నదానం చేశారు. ఇందులో దాదాపు 75 వేల మందికి వండిన ఆహారాన్ని అందించగా, సుమారు 65 వేల మందికి ముడి రేషన్ పంపిణీ చేశారు. ప్రధానంగా పిల్లలకు, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు, రోజు కూలీలకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఆహారం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ, విజయవాడ నగరాల్లో రిలయన్స్ ఫౌండేషన్ అన్నసేవ కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 600 మందికి కిట్ లను అందించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ అన్నసేవ పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. విద్య, మహిళా సాధికారత, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాలలో నీతా అంబానీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. -
జీవితం విస్తరాకు.. తిన్నాక మరి ఉంచరు! ఏమీ లేకుండానే నిన్ను కూడా!
జీవితం క్షణ భంగురం అని తెలిసి కూడా చేయరాని పనులు చేసి మనిషి ఎన్నో అగచాట్లు పడుతుంటాడు. కొందరు అధికారం, అహం, ఆవేశం, అసూయ అనే 'అ'అక్షరం పట్టుకుని ఆఖరికి.. 'ఆ!'.... అని అర్రుల చాచుతూ ఆక్రందన చేసే పరిస్థితిని కొనితెచ్చుకుంటారు. మరికొందరు కామం, క్రోధం, అనే వాటితో క్షమార్హమైన పనులకు పాల్పడి కష్టాల కడలిలో కొట్టుకుపోతుంటారు. పగ, పిసినారితనం, అనే 'ప' అక్షరాన్ని పట్టుకుని పడరాని పాట్లు పడి పెడబొబ్బలు పెడుతుంటారు మరికొందరు. ఆ తర్వాత ఏదో జబ్బు చేసో లేక అనుకోని ప్రమాదంలోనో తనువు చాలిస్తారు. మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసహ్యం కలగకూడదు. ఏంటిది! జీవితం ఇలా వృథా చేసుకున్నానా? అని తెలుసుకునేలోపే మన కథ ముగిసిపోతుంది. అందుకే అంటారు పెద్దలు బతికి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడే పనులు కనీసం ఒక్కటైన చేసి మనిషి అనిపించుకోమని. కనీసం కౌమర, యవ్వన దశలో తెలిసో తెలియకో ఉడుకురక్తంతో ఉచితానుచితాలు ఆలోచించకుండా చేసి ఉండొచ్చు. కనీసం వృద్ధాప్యంలోనైనా తనకు చేతనైనంతలో ఇతరులకు సేవ చేసి తరించాలి. బహుశా అందుకే కాబోలు పెద్దలు మనిషి జీవితం విస్తరాకులాంటిది అని చెప్పారేమో! ఎందుకిలా అన్నారంటే.. ఇది వరకు ఎక్కువగా పెళ్లిళ్లు, పేరంటాలు, వేడుకల్లో.. భోజనాలు విస్తరాకుల్లోనే వడ్డించేవారు. అందువల్ల దీనితో మనిషి జీవితాన్ని పోల్చి ఉండవచ్చు. ఇక మనిషి జీవితానికి విస్తరాక్కి ఉన్న పోలిక ఏంటో చూస్తే.. భోజనం చేసేటప్పుడు మనం కొద్దిగా నీళ్లు విస్తరిలో జల్లి శుభ్రంగా చేసుకుంటాం. ఆ తర్వాత భోజనం పూర్తయ్యేవరకు దానిని జాగ్రత్తగా చూసుకుంటాం. తిన్న మరుక్షణం, ఆ ఆకుని మడిచి దూరంగా విసిరేస్తాం. మనిషి జీవితం కూడా అంతే! ఊపిరి పోగానే ఒక్క క్షణం కూడా ఉంచం. అయితే ఇక్కడ విస్తరాకు పడేసినప్పుడు అది సంతోషడుతుందట. ఎందుకంటే తాను పోయే ముందు కనీసం ఒక్కరి ఆకలినైనా తీర్చటానికి ఉపయోగపడ్డానులే అని తృప్తి పడుతుందట. కానీ మనిషికి ఆ తృప్తి ఉండదు. పోయే ముందు వరకు ఏదో ఒక వ్యాపకంతో సతమతమవుతూ.. ఎవరో ఒకరితో పోట్లాడుతూనే ఉంటాడు మనిషి. చేద్దాంలే సేవ అనుకునేలోపే జీవితం జగడాలు, పట్టింపులతో ముగిసిపోతుంది. ఏ క్షణం మనల్ని మృత్యువు కౌగిలించుకుంటుందో చెప్పలేం. ఆ తరుణం రాగానే మన ఒంటిపై గుడ్డకూడా ఉంచరు. ఎంత పెద్ద ధనికుడైన శ్మశానానికి చేరుకోవాల్సిందే. ఏ డబ్బు కోసం అందరితో తగవులాడి, శత్రుత్వం తెచ్చుకున్నామో.. ఆ సొత్తులోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకుపోలేం. అందుకే పెద్దలు ఊపిరి ఉన్నప్పుడే నలుగురుకి ఉపయోగపడే పనులు చేసేలా జీవించండిరా! అని హితవు చెప్పేది. లేదంటే విస్తరాకు పాటి విలువ కూడా లేని వృథా జీవితంగా మారుతుందని వారి హెచ్చరిక. (చదవండి: సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!) -
Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్
సాక్షి బళ్లారి (కర్ణాటక): రూపాయికే రెండు రొట్టెలు, దాల్, లేదా చిత్రాన్నం వివిధ రకాల ఫ్రైడ్ రైస్‌లతో కూడిన భోజనాన్ని అందించేందుకు జైన్ యువక మండలి ముందుకు వచ్చింది. తక్కువ ధరకే భోజనాన్ని శుక్రవారం నుంచి పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. నగరంలోని జైన్ దేవాలయం వద్ద ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. జైన్ యువక మండలి పదాధికారులు భరత్‌జైన్, తదితరులు మాట్లాడుతూ ఓపీడీ ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, ప్రైవేట్, ప్రభుత్వ బస్టాండ్ల వద్దకు ఈ మొబైల్ వాహనం చేరుకొని పేదలకు రూ.1కే భోజనం అందిస్తుందని తెలిపారు. చదవండి: విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్ -
నేను సైతం...
-
వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు
చత్తీస్ఘడ్: పెళ్లి ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసులో జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పును వెలువరించింది. ఒప్పందం ప్రకారం చేయడంలో విఫలమైనందుకు గాను లక్షరూపాయలు, కోర్టు ఖర్చులకోసం మరో అయిదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఫోరం అధ్యక్షురాలు మైత్రి మాధుర్ ఈ తీర్పును వెలువరించారు. బిలాయ్ కి చెందిన స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ తమ కూతురి పెళ్లి విందుకోసం స్తానిక వెడ్డింగ్ ప్లానర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఎడ్వాన్స్ చెల్లించారు. ఈ పెళ్లికి మూడు రోజుల పాటు భోజన సదుపాయం కల్పించేట్టుగా మాట్లాడుకొని, మెనూని కూడా ఖరారు చేసుకున్నారు. అయితే అనుకున్నట్టుగా మూడు రోజులు భోజనం ఏర్పాట్లు చేయడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మూడు రోజులు వడ్డించాల్సిన భోజనాలు కాస్తా ఒక రోజుతో ముగించేశారు. కనీసం ఆ ఒక్కరోజుఏర్పాట్లు కూడా సవ్యంగా చేయలేదు. భోజనం బెండకాయ వేపుడు, అప్పడం వడ్డించడం మర్చిపోయారు. వెడ్డింగ్ ప్లాన్ నిర్వాహకుల నిర్వాకం ఇంతటితో ఆగిపోలేదు. మరో ఘోరమైనపొరపాటు చేశారు. ఏకంగా పెళ్లివేదిక అలంకరణలో వధూవరుల పేర్లు రాయడం మర్చిపోయారు...ఆహూతులకోసం వేసిన కుర్చీలను అస్తవ్యస్తంగా అమర్చారు. దాదాపు 100 కుర్చీలను వైట్ క్లాత్ తో కవర్ చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో పెళ్లివారిమధ్య వివాదం రేగింది. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పాల్సిన సదరు కంపెనీ,అదనంగా డబ్బులు చెల్లించాలని వేధించడం మొదలు పెట్టింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కంపెనీ నిర్వాకంతో ఆడపెళ్లి వారుగా తాము అనేక అవమానాలను, అవహేళనను ఎదుర్కొన్నామని దీనికి వారు తగిన మూల్యం చెల్లించాలని కోరారు. దీంతో అత్యుత్సాహంగా ప్రవర్తించిన వెడ్డింగ్ ప్లాన్ నిర్వాహకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.