
వంతెనలు అనేవి దురాలను తగ్గించడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేవి. అలాంటి వంతెనపై ఒక నగరం నిర్మిస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే ఏదోలా ఉంది కదూ. ఔను! వంతెనపై ఒక యునిక్ నగరాన్ని నిర్మించారు. కింద నీళ్లు కూడా ఉన్నాయి. చూస్తే ఒక అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తుంది. అంతేగాదు ఆ వంతెన కింద వాటిని అద్భతమైన ప్రకృతి దృశ్యంగా మార్చింది. ఇది చైనాలో ఉంది.
చాంకింగ్‌లోని లిన్షి టౌన్‌షిప్‌లో సాంప్రదాయ చైనీస్, పాశ్చాత్య శైలి కలయికతో భవనాలను నిర్మించినట్లు ఫోటోగ్రాఫర్ గువోజు తెలిపారు. ఇది పర్యాటకులకు అంతరిక్షం గుండా ప్రయాణిస్తున్న అనుభూతి ఇస్తుందని చెప్పారు. ఎప్పుడూ మంచి ప్రేరణనిచ్చే ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ సామాజిక మీడియాలో యాక్టివ్‌గా ఉంగే దిగ్గజ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా అందుకు సంబందించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. ఐతే నెటిజన్లు మాత్రం ఈ వీడియోని చూసి చాలా విభిన్నంగా స్పందించారు. ఇది అసాధ్యం అని ఊహజనితమైనదని ఒకరూ, దీనివల్ల నది జలాల్లో వ్యర్థాలు ఎక్కువతాయని మరొకరూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: చెత్త వివాదం..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యాపారవేత్త)
Imagine living here….. pic.twitter.com/foa7F4jTdC
— Harsh Goenka (@hvgoenka) April 15, 2023