మాస్కో: ఉక్రెయిన్‌తో వివాదం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించడంతో ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఏ దేశమూ రష్యాను భయపెట్టలేదని, ఏకాకిని చేయలేదని వ్యాఖ్యానించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. కష్టాలను అధిగమించేందుకు సన్నద్ధం కావాలని... దేశ సార్వభౌమత్వం, సుస్థిరత, ఐక్యతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునకైనా రష్యా తగిన సమాధానం ఇస్తుందన్నారు.