అనుకుంటలో ‘పల్లెపల్లెకు కాంగ్రెస్’లో పాల్గొన్న సీఆర్‌ఆర్, సుజాత, భార్గవ్‌దేశ్‌పాండే
సాక్షి,ఆదిలాబాద్ : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి ఐక్యత రాగం అందుకుంది. ఈ కొత్త పల్లవిపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నా ఇది ఎన్నికల వరకు కొనసాగుతుందా..లేనిపక్షంలో మూణ్నాళ్ల ముచ్చటేనా అనే అనుమానాలు లేకపోలేదు. గ్రూపు రాజకీయాలపై అధిష్టానం హెచ్చరికల నేపథ్యంలోనే తాజాగా పార్టీలో ఈ మార్పు కనిపిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర ఈనెల 26 నుంచి చేవెళ్ల నుంచి ప్రారంభం కానుండడం, రాష్ట్ర నేతల్లోనే ఎన్ని గ్రూపు రాజకీయాలున్నా ఈ యాత్రను ఐక్యంగా చేపడుతుండగా, జిల్లాల్లోనూ ఐక్యత కనబడాల ని అధిష్టానం ఆదేశించడంతోనే నేతలు కలిసి నడుస్తున్నారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ముందు, తర్వాత అదే పరిస్థితి..
జిల్లాల పునర్విభజనకు ముందు,ఆతర్వాత ఆదిలాబాద్ జిల్లాలో గ్రూపు తగాదాలది అదే పరిస్థితి. పునర్విభజన అనంతరం పార్టీలో ప్రధానం గా ఆదిలాబాద్ నియోజకవర్గం చుట్టే జిల్లా రాజకీయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్య వహరిస్తున్నారు. అయితే జిల్లాల విభజన తర్వాత ఆయన ఎక్కువగా తన నియోజకవర్గం నిర్మల్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో జిల్లా కాం గ్రెస్‌కు దిక్కులేని నావ లాగా తయారై ఎవరికివారే అన్న చందంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గతంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గా ల్లో మహేశ్వర్‌రెడ్డి తన వర్గంగా ఉన్నవారితో సఖ్యంగా ఉంటూ పరోక్షం గా పార్టీలో గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన కూడా ఈ జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు. గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ రైతుబాట కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్‌లో నిర్వహించిన సభలో నూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా సమక్షంలోనే జిల్లాలోని గ్రూపు తగాదాలు బహిర్గతం అయ్యాయి. దీంతో కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలను ఒకగాటి కి తేవడం కష్టమేనని పార్టీ శ్రేణుల్లోనే అభిప్రాయం వ్యక్తమైంది. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి భార్గవ్‌దేశ్‌పాండేకు టికెట్ దక్కింది. అప్పుడు సి.రాంచంద్రారెడ్డితో పాటు గండ్ర త్ సుజాత టికెట్‌ను ఆశించినా చివరిక్షణంలో భంగపడ్డారు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంట నడిచారు. ఆ ఎన్నికల్లో భార్గవ్‌దేశ్‌పాండే మూడో స్థానంలో నిలిచారు.
మూడు ముక్కలు అతికాయి..
2014 ఎన్నికల తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొంత స్తబ్ధత ఏర్పడింది. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా జిల్లా రాజకీయాల్లోనూ కాంగ్రెస్ వేడి పుట్టించేలా ప్రయత్నాలు చేసింది. ఎన్నికలు సమీపిస్తుండగా ఏడాది కాలంగా మా త్రం మళ్లీ గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్‌దేశ్‌పాండేలు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎవరికి వారే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొద్ది నెలలుగా మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి ఆదిలాబాద్ పట్టణంలో వార్డు వార్డు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నా రు. సుజాత ఇటీవల కాలంలో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను కలుస్తూ వచ్చారు. తాజాగా భార్గవ్‌దేశ్‌పాండే పల్లెపల్లెకు కాంగ్రెస్ కార్య క్రమాన్ని ప్రారంభించారు. మొదటిరోజు జైనథ్ మండలంలో కార్యక్ర మం చేపట్టి డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి పాల్గొననున్నట్లు ప్రచారం చేశారు. అయితే మహేశ్వర్‌రెడ్డి రాకపోవడంతో నియోజకవర్గంలో కాం గ్రెస్ గ్రూపు తగాదాలే కారణమన్న అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమైంది. ఇదిలా ఉంటే పల్లె పల్లెకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా బుధవారం భార్గవ్‌దేశ్‌పాండే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంట గ్రా మంలో చేపట్టారు. కార్యక్రమానికి రాంచంద్రారెడ్డి, సుజాతను కూడా ఆహ్వానించారు. అయితే వారు పాల్గొంటారో లేదోనన్న మీమాంసలో ఉండగా, నేతలు కలిసి రావడంతో శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. అదే సం దర్భంగా నేతల ప్రసంగంలోనూ మార్పు కనిపించింది. 2019 ఎన్నికల్లో టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల వరకు ఈ రాగం కొనసాగుతుందా.. లేనిపక్షంలో మళ్లీ పరిస్థితు లు మారుతాయా అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే పల్లె పల్లెకు కాం గ్రెస్ కార్యక్రమాన్ని భార్గవ్‌దేశ్‌పాండే అధిష్టానం అనుమతి తీసుకొ ని ప్రారంభించినట్లు చెబుతున్నారు. మిగతా నేతలు కలిసిరావడం లేద ని ఆయన పార్టీ అధిష్టానం వద్ద వాపోవడంతో అధినాయకత్వం మిగ తా నాయకులతో మాట్లాడినట్లు పార్టీ కేడర్ చెప్పుకుంటుంది. దీంతోనే తాజాగా ఈమార్పు కనిపిస్తుందని పార్టీశ్రేణులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment